మీనాక్షి చౌదరి.. వయ్యారాల జాబిల్లి!

టాలీవుడ్ లో ఇటీవల కాలంలో బిగ్ ఛాన్సెస్ అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న అందాల భామ మీనాక్షి చౌదరి.

Update: 2025-02-17 14:30 GMT

టాలీవుడ్ లో ఇటీవల కాలంలో బిగ్ ఛాన్సెస్ అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న అందాల భామ మీనాక్షి చౌదరి. "ఇచ్చట వాహనములు నిలుపరాదు" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ సుందరి, ఆ తరువాత "హిట్ 2" చిత్రంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇటీవల లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో బాక్సాఫీస్ హిట్స్ అందుకొని టాప్ రేసులోకి వెళ్ళింది.


గ్లామర్‌తో పాటు నటనకు కూడా ప్రాధాన్యం ఇస్తూ, కథానాయికగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ఉంది. ఇటీవలి కాలంలో ఆమె తన స్టైలిష్ లుక్స్, ట్రెడిషనల్ అండ్ మోడ్రన్ అవతారాలతో తరచూ సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. తాజాగా మీనాక్షి చౌదరి షేర్ చేసిన ఫోటోలు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చాయి. సిల్కీ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ డ్రెస్సులో ఆమె న్యూ లుక్ తో అదరగొట్టేసింది.


వెరైటీ ఆఫిట్, హై క్లాస్ జ్యూవెల్రీ, అందమైన కర్లీ హెయిర్ స్టైల్.. ఇవన్నీ ఆమె అందాన్ని మరింత హైలైట్ చేశాయి. ఫోటోషూట్‌లో కనపడిన ఆమె వైవిధ్యమైన ఎక్స్‌ప్రెషన్స్, మృదువైన హావభావాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ లేటెస్ట్ స్టైలింగ్ వెనుక ప్రముఖ స్టైలిస్ట్ శ్రవ్య వర్మ సౌండ్ కాంబినేషన్ ఉంది. ఆమె డ్రెస్ ఎంపిక నుంచి హెయిర్ మేకోవర్ వరకూ ప్రతీ చిన్న విషయం మీద ఫోకస్ పెట్టడం కనిపిస్తోంది.


ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ ద్వారా ఎంపికైన అవుట్‌ఫిట్‌ను ఆమె ఎంతో గ్రేస్‌తో క్యారీ చేస్తూ ఫోటోలకు హైలైట్‌గా నిలిచింది. ఫోటోల్లో ఫ్లోరల్ జ్యూవెలరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక అమ్మడి హవా చూస్తుంటే రాబోయే కాలంలో స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ ఉందని అనిపిస్తోంది. ఈ ఫోటోషూట్‌తో మరోసారి తన గ్లామర్ స్టేట్మెంట్‌ను హైలెట్ చేస్తూ, ఫ్యాన్స్ మనసులను కొల్లగొడుతోంది. మరి అమ్మడికి భవిష్యత్తులో ఇంకా ఎలాంటి అవకాశాలు అందుతాయో చూడాలి.

Tags:    

Similar News