పెళ్లిలో నో- ఫోన్ పాలసీపై ఓపెనైన రకుల్
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ ప్రముఖ హిందీ నిర్మాత -నటుడు జాకీ భగ్నానీని పెళ్లాడిన సంగతి తెలిసిందే.
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ ప్రముఖ హిందీ నిర్మాత -నటుడు జాకీ భగ్నానీని పెళ్లాడిన సంగతి తెలిసిందే. గోవాలో ఈ జంట వివాహం 2024లో జరిగింది. వ్యక్తిగత, రిలేషన్ షిప్ వ్యవహారంపై ఎప్పుడూ గోప్యత పాటించే రకుల్, తన వివాహం గురించిన అత్యంత మధురమైన జ్ఞాపకాల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ గా మాట్లాడారు.
తమ పెళ్లి ఎలాంటి హడావుడి లేకుండా గోప్యంగా జరిగిందని రకుల్ అన్నారు. మేం ప్రతిసారీ పెళ్లి సింపుల్ గా జరగాలని అనుకున్నాం. మాకు సౌకర్యం ఇష్టం.. కానీ మేం అతిగా విలాసాన్ని కోరుకోలేదు. ఈ క్షణాన్ని విలువైనదిగా భావిస్తాం. అందంగా నవ్వడాన్ని ఫీలవుతాం.
మేం మా పెళ్లిని ఆస్వాధించాలనుకున్నాం. ఇది మా జీవితంలోని బెస్ట్ త్రీ -డే వేడుక కావాలని కోరుకున్నాము. కాబట్టి, మేము నో ఫోన్ పాలసీని ప్లాన్ చేసాం. దానివల్ల మేము మా వివాహాన్ని ఆస్వాధించాలనుకున్నాం... అని రకుల్ అన్నారు. నిజానికి ఫోటోలను లీక్ చేయడం ద్వారా హంగామా కావాలనుకోలేదు. మాకు మేమే మా పెళ్లి ఫోటోలు రివీల్ చేయాలనుకున్నామని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. ఈ భామ తదుపరి `మేరే హస్బెండ్ కి బివి`లో కనిపించనుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 22న విడుదల కానుంది. అర్జున్ కపూర్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించాడు.