ఇన్‌స్టాలో ఆలియా అరుదైన రికార్డు
ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆలియా తనకు సంబంధించిన అప్డేట్స్‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంటుంది.
బాలీవుడ్ భామ ఆలియా భట్ కెరీర్ మొదలుపెట్టిన తక్కువ కాలానికే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆర్ఆర్ఆర్ లో నటించి తన క్రేజ్ ను వరల్డ్ వైడ్ గా వ్యాపింప చేసుకుంది ఆలియా. రణ్ బీర్ కపూర్ ను పెళ్లి చేసుకుని ఓ పాపకు జన్మనిచ్చిన ఆలియా నిరంతరం వార్తల్లో నిలుస్తుంది. అయితే అమ్మడు ఇప్పుడో అరుదైన ఘనతను సాధించింది.
ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆలియా తనకు సంబంధించిన అప్డేట్స్‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంటుంది. తాజాగా ఇన్ల్ఫుయెన్సర్ మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ పై హైప్ ఆడిటర్ రిలీజ్ చేసిన లిస్ట్ లో వరల్డ్ లోనే అత్యంత ప్రభావవంతమైన నటిగా రెండవ స్థానాన్ని సంపాదించుకుంది.
ఈ లిస్ట్ లో జెన్నీఫర్ లోపేజ్, డ్వేన్స్ జాన్సన్ లాంటి వారిని కూడా వెనక్కి నెట్టి మరీ ఆలియా ఆ స్థానాన్ని దక్కించుకుంది. ఆలియా సృష్టించిన ఈ విజయం ఇండియన్ సినీ హిస్టరీలోనే గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు. దీంతో అందరూ ఆలియాకు విషెస్ తెలుపుతున్నారు.
ఇక ఆలియా సోషల్ మీడియా విషయానికొస్తే ఆమెకు 85 మిలియన్లకు పైగా ఇన్‌స్టాలో ఫాలోవర్లు ఉన్నారు. సినిమా ముచ్చట్లతో పాటూ, వ్యక్తిగత విషయాలను, తన ఫోటోషూట్స్ ను షేర్ చేస్తూ ఉండే ఆలియా గతేడాది కూడా టైమ్స్ మ్యాగజైన్ రిలీజ్ చేసిన టాప్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్2024 లిస్ట్ లో చోటు దక్కించుకుంది.
ఇదిలా ఉంటే ఆలియాకు సంబంధించిన ఓ వార్త గత కొన్ని రోజులుగా నెట్టింట వైరల్ అవుతుంది. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఆలియా కూడా నటించబోతుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ఆలియా ఓ యువరాణి పాత్రలో కనిపించబోతుందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.