సినిమాలోనే విలన్...బయట మాత్రం రియల్ హీరో!
`పుష్ఫ` నటుడు ధనుంజయ్ అలియాస్ జాలిరెడ్డి ఓ ఇంటివాడు అయ్యాడు. ధన్యత అనే అమ్మాయితో ధనుంజయ్ వివాహం ఘనంగా జరిగింది.
`పుష్ఫ` నటుడు ధనుంజయ్ అలియాస్ జాలిరెడ్డి ఓ ఇంటివాడు అయ్యాడు. ధన్యత అనే అమ్మాయితో ధనుంజయ్ వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుక నిరాడంబరంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధువులు, సన్నిహితులు, స్నేహితులు, సెలబ్రిటీల సమక్షంలో వేడుక జరిగింది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పెళ్లి కూతురు..పెళ్లి కొడుకు దుస్తుల్లో నవ దంతపతులు నెటిజనుల్ని ఆకట్టుకుంటున్నారు. దంపతులిద్దరికి నెటిజనులు శుభాకాంక్షలు చెబుతున్నారు. వధూవరులు సాంప్రదాయ వస్త్రధారణలో ఎంతో అందంగా కనిపిస్తున్నారు. ఇద్దరిదీ ప్రేమ వివాహం. కొంత కాలంగా ప్రేమించుకున్న జంట వివాహ బంధంతో ఒకటవ్వడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేసారు.
పెళ్లి కుమార్తె ధన్యత తాను ఇష్టపడిన వ్యక్తిని మనువాడటంతో సంతోషంగా ఉంది. ఈ వేడుకలో హైలైట్ అయిన మరో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ధనుంజయ్ తన భార్య పాదాలు తాకిన వీడియో ఒకటి ప్రత్యేకంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటి జనులు రియల్ లైఫ్ జాలి రెడ్డి అంటే ఇలా ఉంటాడు? అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. `పుష్ప` సినిమాలో జాలిరెడ్డి పాత్ర మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే రోల్.
కనిపించిన అందమైన అమ్మాయిని చెరిచే రోల్ అది. కానీ ఇక్కడ చూస్తున్న జాలి రెడ్డి అందుకు భిన్నంగా ఎంతో పద్దతిగా ఉన్నాడు. మహిళలంటే తనకు ఎంతో గౌరవ మర్యాదలని ఇలాంటి భర్త దొరికిన భార్య జీవితాంతం సంతోషంగా ఉంటుందని పొగిడేస్తున్నారు. హిందు సంప్రదాయంలో భార్య పాదాలకు భర్త తాక కూడదు. కానీ భార్య భర్త పాదాలు తాకిన తర్వాత ధనుజంయ్ కూడా సమానంగా భావించి భార్య పాదాలు తాకే ప్రయత్నం చేసాడు. ఈ ఒక్క ఘటనతో ధనుంజయ్ అలియాస్ జాలిరెడ్డి రియల్ హీరో అయిపోయాడు.