రష్మీకకు గులాబీలు పంపిన స్పెషల్ పర్సన్.. ప్రేమతో ఇలా!
రష్మిక తన చేతిలో ఒక అందమైన గులాబీల బొకేతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, “నీకు నా మొహంలో చిరునవ్వును ఎలా తెప్పించాలో బాగా తెలుసు పాపలు” అని క్యాప్షన్ జత చేసింది.
టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న రష్మిక మందన్న మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె నటించిన 'ఛావా' సినిమా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద సెంచరీ దాటేసింది. అంతకుముందే, 'పుష్ప 2' సినిమాతో అమ్మడు బిగ్ పాన్ ఇండియా సక్సెస్ అందుకుంది. ఆ సినిమా 1800 కోట్లు రాబట్టిన విషయం తెలిసిందే. అలాగే రానున్న సినిమాలపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
కెరీర్ పరంగా ఈ స్టార్ హీరోయిన్ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, వ్యక్తిగత జీవితం కూడా ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. తాజాగా, రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ పోస్ట్ ఆసక్తికర చర్చకు దారి తీసింది. రష్మిక తన చేతిలో ఒక అందమైన గులాబీల బొకేతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, “నీకు నా మొహంలో చిరునవ్వును ఎలా తెప్పించాలో బాగా తెలుసు పాపలు” అని క్యాప్షన్ జత చేసింది.
ఈ మెసేజ్‌లో “పాపలు” అనే పదానికి నెటిజన్లు విపరీతంగా రియాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఆమె ఈ పోస్ట్‌లో విజయ్ దేవరకొండ తల్లి మాధవి దేవరకొండను ట్యాగ్ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. ఇదివరకే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య రిలేషన్‌షిప్ ఉందనే వార్తలు ఎన్నో వచ్చాయి. వీరిద్దరూ కలిసి వెకేషన్లకు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ, వారు ఎప్పటికీ తమ రిలేషన్‌షిప్‌ను కన్ఫర్మ్ చేయలేదు.
అయితే రష్మిక ఇలా విజయ్ తల్లితో ప్రత్యేక అనుబంధాన్ని చూపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. రష్మిక, విజయ్ మధ్య ప్రత్యేకమైన బంధం ఉందనే అనుమానాలను ఈ చిన్న లీక్ మరింత పెంచేసింది. కొందరు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ, ఇదిగో ప్రేమకథకు మరో క్లారిటీ, ఇది చూస్తుంటే కుటుంబంతో కలిసిపోయినట్లుంది, అంటూ కామెంట్ చేస్తున్నారు.
మరికొందరు ఈ ప్రేమ అనుబంధాన్ని మరింత బలంగా నమ్మేలా చేశారు. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్‌లో 'సికందర్' అనే సినిమాలో సల్మాన్ ఖాన్‌తో కలిసి నటిస్తోంది. అలాగే మరికొన్ని లేడి ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది. కెరీర్ పరంగా రష్మిక ఎంత బిజీగా ఉన్నా, ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంది.