'మజాకా' బ్యూటీ కోరికలు ఇలా ఉన్నాయ్!
తెలుగు హీరోయిన్ రీతు వర్మ గురించి పరిచయం అవసరం లేదు. సొగసరి ఇప్పటికే తెలుగు, తమిళ్ లో చాలా సినిమాలు చేసింది.
తెలుగు హీరోయిన్ రీతు వర్మ గురించి పరిచయం అవసరం లేదు. సొగసరి ఇప్పటికే తెలుగు, తమిళ్ లో చాలా సినిమాలు చేసింది. 'ప్రేమ ఇష్క్ కాదల్' తో ఎంట్రీ ఇచ్చిన రీతూ చాలా తెలుగు సినిమాలు చేసింది. అటుపై కోలీవుడ్ లోనూ చాలా సినిమాల్లో నటించింది. కానీ రీతూకు ఇంకా టాలీవుడ్ లో రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఖాళీ లేకుండా సినిమాలైతే చేస్తుంది గానీ ఫేమస్ కాలేకపోతుంది.
ప్రస్తుతం తెలుగులో 'మజాకా' చిత్రంలో నటిస్తోంది. ఇందులో యంగ్ హీరో సందీప్ కిషన్ కి జోడీగా నటిస్తుంది. సినిమాలో అమ్మడు కాస్త రొమాంటిక్ గానూ కనిపించనుందని ప్రచారంలో ఉంది. హీరోతో లిప్ లాక్ లు వేసినట్లు వినిపిస్తుంది. అయితే తాను పోషించాలనుకుంటోన్న పాత్రలు, డ్రీమ్ రోల్స్ ఇంకా అలాగే మిగిలిపోయాయని ప్రచారంలో భాగంగా రివీల్ చేసింది. `నా సినీ ప్రయణాం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను.
ఎందుకంటే నేను నటి అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు అనుభవిస్తోన్న జీతితమంతా నేను అనుకోకుండా సినిమాల్లోకి రావడంతోనే సాధ్యమైంది. ఆ రకంగా నేను అదృష్టవంతురాలినే. నటిగా చాలా సినిమాల్లో భాగమయ్యాను. వాటిలో గుర్తుంచుకునే కొన్ని పాత్రలున్నాయి. కానీ నాకంటూ కొన్ని డ్రీమ్ రోల్స్ ఉన్నాయి. యాక్షన్ ప్రాధన్యమున్న చిత్రాలు చేయాలని ఉంది. అలాగే పీరియాడిక్ చిత్రాలు..యువరాణి పాత్రల్లో నటించాలన్నది ఎప్పటి నుంచో ఉన్న కోరిక.
'మజాకా'తో కామెడీ సినిమా కూడా చేస్తున్నా. ప్రస్తుతం తెలుగులో ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నా'అని తెలిపింది. అయితే ఆ మల్టీస్టారర్ వివరాలు మాత్రం రీతూ రివీల్ చేయలేదు. అలాగే 'శ్రీకారం' ఫేం కిషోర్ దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నట్లు రివీల్ చేసింది.