అంజనమ్మ ఆరోగ్యంపై చిరంజీవి ఏమన్నారంటే..?

చిరంజీవి క్లారిటీ ఇచ్చారు కాబట్టి అంజనా దేవి మీద ఇక మీడియా ఫోకస్ తగ్గిస్తారని చెప్పొచ్చు.

Update: 2025-02-21 14:15 GMT

మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని అస్వస్థత వల్ల ఆమెను హాస్పిటల్ లో జాయిన్ చేయించారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఐతే వీటిపై స్పందించారు చిరంజీవి. మా అమ్మ అస్వస్థతగా ఉందని.. హాస్పిటల్ లో చేరారని మీడియా కథనాలు తన దృష్టికి వచ్చాయి.. రెండు రోజులుగా ఆమె కాస్త అస్వస్థతకు గురయ్యారని చెప్పాలనుకుంటున్నా.. ఐతే ఆమె ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. అంతేకాదు ఆమె ఎంతో హుషారుగా ఉన్నారు. ఆమె ఆరోగ్యం గురించి ఎలాంటి ఊహాజనిత కథనాలు ప్రచారం చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ క్రమంలో ఆయన సోషల్ మీడియా ద్వారా ఈ మెసేజ్ ని రాసుకొచ్చారు.

చిరంజీవి తల్లి అంజనమ్మకు అనారోగ్యంగా ఉందని నేటి ఉదయం నుంచి మీడియా కథనాలు వచ్చాయి. ఐతే ఆమె అస్వస్థత నిజమే కానీ కొన్ని మీడియా కథనాలు ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లారన్నట్టుగా రాసుకొచ్చారు. ఐతే విషయం చిరంజీవి దాకా వెళ్లడం వల్ల అమ్మ ఆరోగ్యంగానే ఉన్నారని మీడియాకు క్లారిటీ ఇచ్చారు.

సెలబ్రిటీల విషయంలో మీడియా చూపించే అత్యుత్సాహం తెలిసిందే. అక్కడ ఏం జరిగింది అన్నది తెలిసింది కొంత అయితే దానికి వీరు అదనంగా యాడ్ చేసి ప్రసారం చేస్తారు. అంతేకాదు ఎలాంటి క్లారిఫికేషన్ లేకుండా చాలా వరకు తప్పుడు కథనాలు ప్రసారం చేస్తుంటారు. ఐతే వాటికి త్వరగా క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం చాలా వరకు న్యూస్ వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

ఐతే తన మదర్ అనారోగ్య విషయం గురించి మీడియా రకరకాల కథనాలు ప్రసారం చేయడం పట్ల సైలెంట్ గా ఉంటే ఇంకా అలాంటివి కొనసాగిస్తారనే ఉద్దేశంతో చిరంజీవి తన సోషల్ మీడియా వేదిక ద్వారా అమ్మ ఆరోగ్యంగానే ఉనారంటూ క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి క్లారిటీ ఇచ్చారు కాబట్టి అంజనా దేవి మీద ఇక మీడియా ఫోకస్ తగ్గిస్తారని చెప్పొచ్చు. సినిమా వాళ్ల వార్తలకు ఎక్కువ రీచ్ ఉంటుందని మీడియా అక్కడ ఏం జరిగినా జరగకపోయినా జస్ట్ ఒక న్యూస్ బయటకు వస్తే చాలు దానిలో నిజ నిర్ధారణ లేకుండానే రకరకాల కథనాలు ప్రసారం చేస్తారు. మీడియా అత్యుత్సాహాన్ని గుర్తించిన చిరంజీవి వాటికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఐతే అంజనాదేవి అనారోగ్య వార్తలపై మెగా ఫ్యాన్స్ కూడా కాస్త కంగారు పడ్డారు.

Tags:    

Similar News