సూపర్‌స్టార్‌పై నోరు జారిన వెటరన్
జావేద్ జాఫేరి పరిచయం అవసరం లేదు. బాలీవుడ్‌లో సీనియర్ నటుడు. దశాబ్ధాలుగా అతడి నటనను చూస్తూనే ఉన్నాం. అతడు సినిమాల బాక్సాఫీస్ విజయానికి సోషల్ మీడియా ఎలా సహాయపడుతుందో మాట్లాడారు.
జావేద్ జాఫేరి పరిచయం అవసరం లేదు. బాలీవుడ్‌లో సీనియర్ నటుడు. దశాబ్ధాలుగా అతడి నటనను చూస్తూనే ఉన్నాం. అతడు సినిమాల బాక్సాఫీస్ విజయానికి సోషల్ మీడియా ఎలా సహాయపడుతుందో మాట్లాడారు. సోషల్ మీడియాలు బాక్సాఫీస్ విజయానికి సహకరిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, ఊర్వశి రౌతేలా, రజనీకాంత్ లను ఉదాహరణలుగా పేర్కొంటూ అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
`హ్యూమన్స్ ఆఫ్ బాంబే`తో ఆయన మాట్లాడుతూ-``భారీ ఆన్‌లైన్ ఫాలోయింగ్ స్టార్ పవర్‌ను నిర్ణయించగలదనే భావనతో జాఫేరి విభేదించాడు. సోషల్ మీడియా ఆరంభం సహాయపడుతుంది కానీ, లక్షలాదిగా ఉన్న ఫాలోవర్లు టికెట్లు కొంటారా? లేదా అనేదే నిజమైన పరీక్ష`` అని అన్నారు. ఊర్వశి రౌతేలాకు 70 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఫాలోవర్లు టికెట్ కొనే ప్రేక్షకులుగా మారుతారా? 10 మిలియన్లు అంటే 1 కోటి మంది - ఆ 1 కోటి మంది రూ. 250 సినిమా టిక్కెట్లు కొంటే, ఆ సినిమా రూ. 100 కోట్లు సంపాదించేది. కానీ అది అలా వర్కవుట్ కాదు`` అని విశ్లేషించారు. ప్రమోషనల్ కార్యకలాపాలు, సోషల్ మీడియాల సందడి మాత్రమే సినిమా విజయానికి హామీ ఇవ్వవని జాఫేరి నొక్కి చెప్పారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సినిమా ట్రైలర్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రజలు ట్రైలర్‌ను ఇష్టపడితే సినిమా చూస్తారని.. నటుడి టీవీ షో ప్రచారాలు, డ్యాన్స్ కార్యక్రమాల ఆదరణ సంఖ్యతో సంబంధం లేదని అన్నారు.
సల్మాన్ ఖాన్ సినిమా రూ. 10-15 కోట్ల ఓపెనింగ్‌ను పొందవచ్చు మరియు రూ. 50 కోట్ల ఓపెనింగ్‌ను కూడా పొందవచ్చు. ట్రైలర్ తో ప్రజలు గ్రహించేది అంతవరకే. సల్మాన్ ఖాన్ సినిమాలన్నీ రూ. 50 కోట్ల ఓపెనింగ్స్ సాధించవు ! అని కూడా జాఫేరి అన్నారు. ప్రతిదీ సినిమా ట్రైలర్‌పై ఆధారపడి ఉంటుంది.. సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్యపై కాదు.. అని అన్నారు.
సౌత్ సూపర్‌స్టార్‌లలో రజనీకాంత్ పేరును ఉదహరిస్తూ... తక్కువ ప్రమోషన్ చేసినా కానీ.. రజనీకాంత్ సినిమాలు బలమైన కంటెంట్ , ప్రేక్షకులతో ఆయన వ్యక్తిగత కనెక్షన్ కారణంగా బాగా ఆడతాయని జాఫ్రీ విశ్లేషించారు. కంటెంట్ నాణ్యతతో ఉంటే సినిమా బాగా ఆడుతుందని ఆయన అన్నారు. అయితే అతడు తన వ్యాఖ్యానంలో సల్మాన్ ని తక్కువ చేసి, రజనీని ఎక్కువ చేసి చూపించాలని ఎక్కడా చూడలేదు. కేవలం ఒక ఉదాహరణగా మాత్రమే తీసుకున్నాడు.