ఐఎండిబి స‌ర్వేలో భారీ అంచ‌నాల చిత్రం

టాలీవుడ్ నుంచి ఈ ఏడాది అతి పెద్ద హిట్ చిత్రంగా నిలిచింది క‌ల్కి 2989ఏడి. ప్ర‌భాస్ న‌టించిన ఈ చిత్రం 1000కోట్ల క్ల‌బ్‌లో నిలిచింది.

Update: 2024-09-01 08:55 GMT

టాలీవుడ్ నుంచి ఈ ఏడాది అతి పెద్ద హిట్ చిత్రంగా నిలిచింది క‌ల్కి 2989ఏడి. ప్ర‌భాస్ న‌టించిన ఈ చిత్రం 1000కోట్ల క్ల‌బ్‌లో నిలిచింది. మునుముందు ఇదే ఏడాదిలో మ‌రో రెండు తెలుగు చిత్రాల‌పై భారీ అంచ‌నాలున్నాయి. ఈ రెండు సినిమాలు క‌నీసం 500 కోట్ల క్ల‌బ్ నుంచి 1000 కోట్ల క్లబ్ వైపు వెళ్లేందుకు ఆస్కారం ఉంద‌ని అభిమానులు న‌మ్ముతున్నారు. ఆ రెండిటిలో ఒక‌టి ఎన్టీఆర్- దేవ‌ర1 కాగా, మ‌రొక‌టి బ‌న్ని- పుష్ప 2.

ఈ సంవత్సరం చివరిలో `దేవ‌ర- 1` విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఎన్టీఆర్- కొర‌టాల క్రేజీ కాంబినేష‌న్ లో వ‌స్తున్న ఈ మూవీతోనే జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం అవుతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన సింగిల్స్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. తార‌క్ యాక్ష‌న్ అవ‌తార్ అభిమానుల్లోకి దూసుకెళ్ల‌డ‌మే గాక, జాన్వీతో తార‌క్ రొమాన్స్ అంచ‌నాల‌ను పెంచుతున్నాయి. ఇక ఐఎండిబి- 2024లో మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ చిత్రాల జాబితాలో ఉన్న ఏకైక భారతీయ చిత్రం దేవ‌ర అంటూ ప్ర‌క‌టించింది. 2024 చివ‌రి త్రైమాసికం (క్వార్ట‌ర్)లో పెద్ద హోప్ ఉన్న చిత్రం దేవ‌ర‌1. లిటిల్ బ్రదర్, వన్ హ్యాండ్ క్లాపింగ్, మ్యాన్ వర్సెస్ ఫోన్, మెగాలోపోలిస్ వంటి చిత్రాలు ఆ త‌ర్వాత జాబితాలో ఉన్నాయి.

అయితే తార‌క్ సినిమాకి ఐఎండిబి ప‌ట్టంగ‌ట్ట‌డం వెన‌క కార‌ణం లేక‌పోలేదు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్ప‌టికే ఆస్కార్ అందుకున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో న‌టుడు. ఆర్.ఆర్.ఆర్ `నాటు నాటు`కు ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో ఆస్కార్ ద‌క్క‌డంలో తార‌క్ పాత్ర విస్మ‌రించ‌లేనిది. అత‌డి అద్భుత‌మైన ఎన‌ర్జిటిక్ డ్యాన్సుల‌ను ఎవ‌రూ మ‌ర్చిపోలేరు. అలాంటి ఒక గొప్ప ప్ర‌తిభావంత‌మైన‌ న‌టుడు `దేవ‌ర‌`తో బ‌రిలో దిగుతుంటే, ఆటోమెటిగ్గా అంచ‌నాలు పెరిగాయి. దేవ‌ర ఈ సీజ‌న్ లో విడుద‌ల‌వుతున్న అతి పెద్ద పాన్ ఇండియ‌న్ చిత్రం. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ అయితే తార‌క్ ద‌శ తిరిగిన‌ట్టే. రెట్టించిన ఉత్సాహంతో దేవ‌ర సీక్వెల్ ని పూర్తి చేసి `వార్ 2`తోను ద‌డ పుట్టిస్తాడ‌ని అంచ‌నా. దేవ‌ర 1 సెప్టెంబర్ 27న విడుదల కానుంది.

Tags:    

Similar News