ఇండిపెండెన్స్ డే బ్యాక్ డ్రాప్ ఇర‌గదీస్తున్నారుగా!

తాజాగా 2024 లో సినిమాల‌తో పాటు...వెబ్ సిరీస్ ల్ గా కొన్ని స్వాతంత్రం బ్యాక్ డ్రాప్ లో మ‌రికొన్ని చిత్రాలు రాబోతున్నాయి. వాటి వివ‌రాల్లోకి ఓసారి వెళ్తే

Update: 2024-05-03 06:26 GMT

దేశం గ‌ర్వించ‌ద‌గ్గ సినిమాలెన్నో ఉన్నాయి. అందులోనూ స్వాతంత్య్ర నేప‌థ్యాన్ని ఆధారంగా చేసుకుని తెర‌కెక్కిన చిత్రాల‌కైతే ప్ర‌త్యేక‌మైన గౌర‌వం..గుర్తింపు ఉంటాయి. ఏటా ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ మ‌ధ్య కాలంలో సినిమాల‌తో పాటు ఓటీటీలు అందుబాటులోకి రావ‌డంతో ఇండిపెండెన్స్ డేని ఆధారంగాచేసుకుని తెర‌కెక్కుతోన్న సిరీస్ లు కూడా ఎన్నో క‌నిపిస్తున్నాయి. తాజాగా 2024 లో సినిమాల‌తో పాటు...వెబ్ సిరీస్ ల్ గా కొన్ని స్వాతంత్రం బ్యాక్ డ్రాప్ లో మ‌రికొన్ని చిత్రాలు రాబోతున్నాయి. వాటి వివ‌రాల్లోకి ఓసారి వెళ్తే...

స్వాతంత్య్ర‌ స‌మ‌ర‌యోధుడు మ‌హ‌త్మాగాంధీ జీవితంపై ఇప్ప‌టివ‌ర‌కూ ప‌లు చిత్రాలు తెర‌కెక్కిన‌ సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ స‌హా ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ‌లో ఎన్నో చిత్రాలొచ్చాయి. అయితే వాటిలో గాంధీ జీవితానికి సంబంధించి కొన్ని అంశాల్నే తీసుకుని తెర‌కెక్క‌కించారు. పూర్తి స్థాయిలో మ‌హాత్ముడి జీవితంపై చిత్రాలు ఇప్ప‌టివ‌ర‌కూ తెర‌కెక్క‌లేదు. ఈ నేప‌థ్యంలో గాంధీపై హిందీలో ఓ వెబ్ సిరీస్ రూపొందుతుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌న్స‌ల్ మెహ‌తా ఈ వెబ్ సిరీస్ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గాంధీ పాత్ర‌లో గుజ‌రాతీ న‌టుడు ప్ర‌తీక్ గాంధీ న‌టిస్తున్నారు.

భార‌త స్వాతంత్య్ర‌ పోరాట కాలం నాటి ప‌రిస్థితుల్ని క‌ళ్ల‌కు క‌ట్ట‌డానికి హ‌న్స‌ల్ రెడీ అవుతున్నారు. గాంధీ జీవితంపై ప్ర‌చురింప‌బ‌డిన ప‌లు పుస్త‌కాల్ని..ఆ కాలం నాటి ఆధారాల్సి బేస్ చేసుకుని పూర్తి స్థాయిలో గాంధీ క‌థ‌ని తెర‌కెక్కిస్తున్నారు. వీటిలో ప్ర‌ధానంగా ప్ర‌ముఖ ర‌చ‌యిత రామ‌చంద్ర గుహ రాసిన `గాంధీ బిఫోర్ ఇండియా`..`గాంధీ ది ఇయర్స్ ద‌ట్ ఛేంజ్ ది వ‌ర‌ల్డ్` ర‌చ‌న‌ల్ని మెయిన్ గా తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఈ క‌థ కోసం హ‌న్స‌ల్ మోహ‌తా చాలా రీసెర్చ్ చేసారు. దేశ పౌరుడిగా ఓ బాధ్య‌త ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

అలాగే స‌న్ని డియోల్ ప్ర‌ధాన పాత్ర‌లో రాజ్ కుమార్ సంతోషి తెర‌కెక్కిస్తోన్న మ‌రో చిత్రం `లాహోర్ 1947`. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించ‌డం విశేషం. దేశ భ‌క్తి నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది రిప‌బ్లిక్ డేకి రిలీజ్ కానుంది. పాకిస్తాన్-ఇండియా మ‌ధ్య ఉన్న ఎమోష‌న్ ని ఇందులో హైలైట్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్ లో ఎన్నో చిత్రాలు రూపొందించిన ద‌ర్శ‌క‌-నిర్మాత నిఖిల్ అద్వాణీ దేశ భ‌క్తి నేప‌థ్యంలోనే ఓ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. స్వాతంత్రానికి పూర్వం జ‌రిగిన సంఘ‌ట‌న‌లు ఆధారంగా `ప్రీడ‌మ్ ఎట్ మిడ్ నైట్` టైటిల్ తో ఈ సిరీస్ తెర‌కెక్కుతోంది. ఇందులో జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ పాత్ర‌లో సిద్దాంత్ గుప్తా... గాంధీ పాత్ర‌లో చిరాగో వోహ్రా.. స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ పాత్ర‌లో రాజేంద్ర చావ్లా పోషిస్తున్నారు.

Tags:    

Similar News