ఇండియాని షేక్ చేసిన ఇండస్ట్రీ హిస్టరీ వాళ్లదే!
2023 భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన సంవత్సరంగా నిలిచింది అన డంలో ఎలాంటి సందేహం లేదు
2023 భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన సంవత్సరంగా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2022 ఏడాదితో పోలిస్తే 2023 లో కలెక్షన్లు 15 శాతం అధికంగా పెరిగాయి. దీంతో 2023 వసూళ్ల నామ సంవత్సరం అనడంలో అతిశయోక్తిలేదు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సైతం ధృవీకరించారు. ఎంతో గొప్పగా 2023 అన్ని పరిశ్రమలకు కలసొచ్చిందని చెప్పుకొచ్చారు.
జవాన్.. పఠాన్.. యానిమల్.. గదర్ 2, జైలర్.. సలార్.. లియో..వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేసాయి. ఓ నిదేవిక ప్రకారం గత క్యాలెండర్ ఇయర్‌లో భారతీయ చలనచిత్ర పరిశ్రమ 12226 కోట్లకు పైగా వసూళ్లని సాధించినట్లు తెలుస్తోంది. 2022తో పోలిస్తే 2023లో కలెక్షన్లు 15% పెరిగాయి.
బాలీవుడ్ పరిశ్రమ దాదాపు 5380 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. హిందీ పరిశ్రమ ఏడాది వ్యవధిలో 5000 కోట్ల మార్క్‌ను దాటడం చరిత్రలో ఇదే తొలిసారి. కరోనా మహమ్మారి తర్వాత బాలీవుడ్ ఎలాంటి పరిస్థితుల్లోకి దిగజారిందో తెలిసిందే. కరోనా దెబ్బకి ఇండస్ట్రీ నష్టాల్లో కూరుకుపోయింది. రిలీజ్ అయిన సినిమాలన్నీ దారుణమైన ఫలితాలు చూసాయి. ఈ సమయంలో కొన్ని పరిమిత బడ్జెట్ సినిమాలు మంచి వసూళ్లు సాధించి ఇండస్ట్రీ కి ఊపిరిపోసాయి.
ఆ తర్వాత షారుక్ సినిమాలు వరుసగా రిలీజ్ అవ్వడంతో ఉత్సాహం తోడైంది. ఇక 2300 కోట్ల షేర్‌తో తెలుగు చిత్ర పరిశ్రమ గతేడాది రెండో స్థానాన్ని ఆక్రమిం చింది. ప్రభాస్ -చిరంజీ..బాలయ్య తప్ప అగ్ర హీరోల నుంచి ఇంకెవరు మార్కెట్ లోకి రాలేదు. సలార్..వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు భారీ వసూళ్లు సాధించడంతోనే రెండవ స్థానం సాధ్యమైందని నివేదిక చెబుతుంది. ఇక కోలీవుడ్ దాదాపు 1960 కోట్ల షేర్ తో మూడవ స్థానంలో ఉంది.
'జైలర్'.. 'లియో' సినిమాలు 1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించంతోనే ఇది సాధ్యమైంది. మాలీవుడ్ 572 కోట్లు.. శాండిల్ వుడ్ 312 కోట్లు వసూళ్లతో వరుసగా నాల్గవ.. ఐదవ మరియు ఆరవ స్థానాలను ఆక్రమిం చాయి. మొత్తంగా గతేడాది వసూళ్లలో బాలీవుడ్ నెంబర్ వన్ గా నిలవడం విశేషం. ఇది కేవలం షారుక్ ఖాన్..రణబీర్ కపూర్ చిత్రాలతోనే సాధ్యమైంది. 2024 లోనూ భారీ గా చిత్రాలు విడుదల కాబోతున్నాయి.