ఇండ‌స్ట్రీపై ఆ సీనియ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

కొత్త‌ద‌నం లేన‌ప్పుడు సినిమాలు త‌ప్ప‌కుండా బోర్ కొడ‌తాయి' అన్నారు. బాలీవుడ్ ని ఉద్దేశించి గ‌తంలో ప‌లువురు న‌టీన‌టులు ఇలాగే విర‌చుకుని ప‌డిన సంద‌ర్భాలున్నాయి.

Update: 2024-02-19 10:46 GMT

సీనియ‌ర్ న‌టుడు న‌షీరుద్దీన్ షా బాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌ని ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. డ‌బ్బులు కోస‌మే సినిమాలు చేస్తే కొన్నాళ్ల‌కు సినిమాల‌పై అంద‌రికీ వెగ‌టు పుడుతుంద‌ని అన్నారు. ఓ చ‌ర్చా కార్య‌క్ర‌మంలో న‌షీర్ ఈ వ్యాఖ్య‌లు చేచేసారు. ఇంకా ఆయ‌న ఏమన్నారంటే?.. 'మ‌న‌ది 100 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన సినీ ప‌రిశ్ర‌మ‌గా గొప్ప‌గా చెప్పుకుంటాం. కానీ వందేళ్ల‌గా మూస ధోర‌ణిలోనే సినిమాలు చేసుకుం టున్నాం.

వాటినే ప్రేక్ష‌కుల‌పై రుద్దుతున్నాం. అందుకే నేను సినిమాలు చూడ‌ట‌మే మానేసాను. మ‌న భార‌తీయ ఆహారం ప్ర‌పంచంలో ఏ మూల‌కు వెళ్లినా తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌తాం. అందులో ఒక‌ర‌క‌మైన ప్ర‌త్యేక రుచిని క‌లిగి ఉంటుంది. మ‌రి హిందీ సినిమాలో ప్ర‌త్యేక‌త ఏముంది? అంటే భూత‌ద్దం పెట్టి వెతికినా ఎక్క‌డా క‌నిపించ‌దు. కొత్త‌ద‌నం లేన‌ప్పుడు సినిమాలు త‌ప్ప‌కుండా బోర్ కొడ‌తాయి' అన్నారు. బాలీవుడ్ ని ఉద్దేశించి గ‌తంలో ప‌లువురు న‌టీన‌టులు ఇలాగే విర‌చుకుని ప‌డిన సంద‌ర్భాలున్నాయి.

గ‌త కొన్నాళ్ల గా అక్క‌డ ప‌రిశ్ర‌మ స‌క్సెస్ రేట్ ప‌డిపోవ‌డంతో ఈ ర‌క‌మైన విమ‌ర్శ‌లు పెద్ద ఎత్తున తెర‌పైకి వ‌చ్చాయి. కంటెంట్ లో నాణ్య‌త త‌గ్గిపోతుంద‌ని...తీసిన సినిమాల‌కు సీక్వెల్స్ తీయ‌డం..హింట్ ప్రాంచై జీల్ని కొన‌సాగిండ‌చం వంటివి చేయ‌డంతో కొత్త క్రియేటివిటీకి ఛాన్స్ ఎక్క‌డ‌? అని విమ‌ర్శ‌లు వినిపిం చాయి. సినిమాల కంటే నెట్ ప్లిక్స్ లో రిలీజ్ అవుతోన్న డాక్యుమెంట‌రీలు..ఓటీటీలు చూస్తుంటే ఎంత‌గా వెనుక‌బ‌డ్డాం? అన్న‌ది స్ప‌ష్ట‌మైందంటూ ఓ సీనియ‌ర్ న‌టుడు విమ‌ర్శించారు.

గ‌త ఏడాది కేవ‌లం షారుక్ ఖాన్ సినిమాలు త‌ప్పితే ఇంకే హీరో సినిమా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద రాణించ‌ని సంగ‌తి తెలిసిందే. అక్ష‌య్ కుమార్ ఏడాదికి ఆరేడు సినిమాలు రిలీజ్ చేస్తున్నా..క‌నీసం సినిమాకి పెట్టిన పెట్టుడి కూడా తిరిగా రావ‌డం లేదు. థియేట‌ర్ రిలీజ్ కంటే ఓటీటీలో రిలీజ్ అయిన కొన్ని సినిమాల‌కు విష‌యం ఉన్న చిత్రాలుగా ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కింది.

Tags:    

Similar News