అక్కడ కల్కి, పుష్ప 2 కలెక్షన్స్ ఎలా ఉంటాయో?

ఇక సీడెడ్ లో కలెక్షన్స్ సినిమాల రిజల్ట్ ని డిసైడ్ చేస్తాయనే టాక్ ఇండస్ట్రీ సర్కిల్ లో ఉంది.

Update: 2024-06-01 03:45 GMT

సినిమాల రిలీజ్ సమయంలో తెలుగు రాష్ట్రాలలో ఉన్న థియేటర్స్ ను నైజాం, ఆంధ్రా, సీడెడ్ గా డివైడ్ చేస్తారు. ఏరియాల వారీ థీయాట్రికల్ రైట్స్ కూడా ఇదే ప్రాతిపాదిక మీద అమ్ముతూ ఉంటారు. సీడెడ్ ప్రాంతం అంటే ఏపీలో రాయలసీమ జిల్లాలతో పాటు కర్ణాటకలోని మెజారిటీ తెలుగు ప్రజలు ఉన్న బళ్ళారి, తుముకూరు జిల్లాలు వస్తాయి. ఈ జిల్లాలలో తెలుగు సినిమాలే ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి.

ఇక సీడెడ్ లో కలెక్షన్స్ సినిమాల రిజల్ట్ ని డిసైడ్ చేస్తాయనే టాక్ ఇండస్ట్రీ సర్కిల్ లో ఉంది. మెజారిటీగా యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథలకి సీడెడ్ లో మంచి ఆదరణ ఉంటుంది. మొదటి రోజు షేర్ పరంగా చూసుకుంటే సీడెడ్ లో టాప్ జాబితాలో ఉన్న సినిమాలు ఇలా ఉన్నాయి. సీడెడ్ లో మొదటి రోజు హైయెస్ట్ షేర్ వసూలు చేసిన మూవీ రాజమౌళి ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మొదటి రోజు 17 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

దీని తర్వాత స్థానంలో టాప్ 2 చిత్రంగా రామ్ చరణ్ డిజాస్టర్ మూవీ వినయ విధేయ రామ ఉండటం విశేషం. ఈ చిత్రం ఏకంగా 7.15 కోట్ల షేర్ మొదటి రోజు సీడెడ్ ప్రాంతంలో వసూళ్లు చేసింది. ఈ రికార్డ్ ని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు కూడా ఇప్పటి వరకు బ్రేక్ చేయలేకపోవడం విశేషం. మూడో స్థానంలో 6.45 కోట్ల షేర్ తో ప్రభాస్ సలార్ మూవీ నిలిచింది. ప్రశాంత్ నీల్ కి రాయలసీమ, కర్ణాటక ప్రాంతాలలో మంచి చరిష్మా ఉంది.

ఆ ప్రభావం కలెక్షన్స్ కనిపించింది. మొదటి రోజు సలార్ మూవీ 6.45 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. నెక్స్ట్ టాప్ 4గా బాహుబలి 2 మూవీ 6.35 కోట్ల షేర్ తో నిలిచింది. టాప్ 5 మూవీగా మెగాస్టార్ చిరంజీవి సైరా మూవీ నిలవడం విశేషం. ఈ సినిమా మొదటి రోజు 5.61 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. తరువాత స్థానాలలో 5.50 కోట్ల షేర్ తో బాలయ్య వీరసింహారెడ్డి, 5.30 కోట్ల షేర్ తో ఎన్టీఆర్ అరవింద సమేత నిలిచాయి. ఈ రెండు సినిమాలు రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథలతో తెరకెక్కినవి కావడం విశేషం.

నెక్స్ట్ 5.08 కోట్ల షేర్ తో బాహుబలి మూవీ, 5.07 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ప్రభాస్ సాహో మూవీ టాప్ 9గా నిలిచింది. ఈ ఏడాది కల్కి, పుష్ప 2 చిత్రాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలపై ఎక్స్ పెక్టేషన్స్ హైఎండ్ లో ఉన్నాయి. వీటిలో ఒక్క సినిమా అయిన సీడెడ్ లో ఫస్ట్ డే టాప్ షేర్ రికార్డ్ ని బ్రేక్ చేసే అవకాశం ఉందా అనేది వేచి చూడాలి. కచ్చితంగా ఈ రెండు చిత్రాలకి ఆ సత్తా అయితే ఉంది. కానీ సీడెడ్ లో పబ్లిక్ ఎలాంటి రిజల్ట్ ఇస్తారనేది మాత్రం అప్పుడే అంచనాకి రాలేమని ట్రేడ్ పండితులు అంటున్న మాట.

Tags:    

Similar News