'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌కి ఎండ్ కార్డ్?

రాజ్ అండ్ డీకే ఇంకా ఎన్ని సీజ‌న్ల‌ను ర‌న్ చేస్తారు? అన్న‌దానిపై ఇంకా స‌స్పెన్స్ వీడ‌లేదు.

Update: 2024-08-23 03:30 GMT

మనోజ్ బాజ్‌పేయి, ప్రియ‌మ‌ణి, స‌మంత వంటి స్టార్లు నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ ఇప్ప‌టికే రెండు సీజ‌న్లుగా స్ట్రీమింగ్ అయింది. ఓటీటీలో బంప‌ర్ హిట్ సిరీస్ ఇది. ఇప్పుడు మూడో భాగం తెర‌కెక్కుతోంది. అయితే ఈ వెబ్ సిరీస్ కి ముగింపు అన్న‌దే లేదా? అంటూ అభిమానుల్లో చ‌ర్చ సాగుతోంది. రాజ్ అండ్ డీకే ఇంకా ఎన్ని సీజ‌న్ల‌ను ర‌న్ చేస్తారు? అన్న‌దానిపై ఇంకా స‌స్పెన్స్ వీడ‌లేదు.

తాజాగా అందిన స‌మాచారం మేరకు... శ్రీకాంత్‌గా మనోజ్ బాజ్‌పేయి ప్రయాణం నాల్గవ భాగంతో ముగుస్తుందని క‌థ‌నాలొస్తున్నాయి. నాల్గవ సీజన్‌తో ముగుస్తుంది. దర్శకులు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే ఇప్పటికే మూడో సీజ‌న్ పనుల్లో ఉన్నారు. ప్రియమణి, షరీబ్ హష్మీ సహా పలువురు తారాగణం ఈ సిరీస్ లో తిరిగి చేరారు. సిరీస్‌ను ముగించే తుది నిర్ణయం సీజన్ 3 ప్రజాదరణ, మేక‌ర్స్ అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుంది.

మనోజ్ బాజ్‌పేయి `ది ఫ్యామిలీ మ్యాన్` సిరీస్‌లో శ్రీకాంత్ తివారీ రిలేటబుల్ వ్యక్తిత్వంపై అభిమానులు చాలా క‌సిగా ఉన్నారు. ప్రేక్షకులు ఎల్లప్పుడూ ఈ పాత్ర నుంచి మరిన్ని రిలేటెడ్ అంశాల‌ను కోరుకుంటారు. అయితే ఇది ఇంకా ఎన్నాళ్లు? శ్రీ‌కాంత్ పాత్ర‌కు ముగింపు లేదా? అంటే.. ముగింపు త్వ‌ర‌లోనే ఉంది. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు రాజ్ నిడిమోరు, కృష్ణ DK ఇప్పటికే ఈ గూఢచారి డ్రామా మూడవ సీజన్‌పై పని చేస్తున్నారు.. దానిని నాల్గవ భాగంతో ముగించాలని ప్లాన్ చేస్తున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ 3 చిత్రీక‌ర‌ణ కోసం ప్ర‌స్తుతం ప్రణాళికలు వేస్తున్నారు. దీనిని ముగించాలా వ‌ద్దా? అన్న‌ది పార్ట్ 3 ఆద‌ర‌ణ‌.. భాగ‌స్వాముల ఆలోచ‌న‌ల‌పై ఆధార‌ప‌డి ఉంటుంద‌ని సోర్స్ చెబుతోంది.

2019లో తొలి సీజ‌న్ ప్రీమియర్ అయింది. ది ఫ్యామిలీ మ్యాన్‌లో మనోజ్ బాజ్‌పేయి భార్యగా ప్రియమణి నటిస్తుండగా, షరీబ్ హష్మీ అతడి సన్నిహితుడుగా క‌నిపిస్తున్నారు. రెండవ భాగంలో సమంత రూత్ ప్రభు అరంగేట్రం చేసింది. సీజన్ 3లో సుచిత్ర తివారీగా ప్రియమణి, జేకే తల్పాడేగా షరీబ్ హష్మీ, ధృతి తివారీగా ఆశ్లేషా ఠాకూర్, అథర్వ్ తివారీగా వేదాంత్ సిన్హా తిరిగి న‌టిస్తున్నారు. హాస్యం.. గూఢచర్య థ్రిల్లర్ అంశాలను అద్భుతంగా మిళితం చేసి ఒక ఉద్యోగి ప‌డే పాట్ల‌ను ఎంతో తెలివిగా తెర‌కెక్కించారు రాజ్ అండ్ డీకే. గూఢ‌చ‌ర్యంలో ఒక సాధార‌ణ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఉద్యోగి పాట్లు అంద‌రికీ ఎంత‌గానో క‌నెక్ట‌య్యాయి.

Tags:    

Similar News