తగ్గేదేలే వాళ్లిద్దరు దూసుకొచ్చేయడం లాంఛనమే!
అయితే మేము మాత్రం తగ్గేదేలే అంటూ పుష్ప-2 టీమ్ నిన్నటి రోజున క్లారిటీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే.
ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 'కల్కి 2898`...అల్లు అర్జున్ నటిస్తోన్న 'పుష్ప-2` చిత్రాలు రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని నెట్టింట ఏ రేంజ్ లో ప్రచారం సాగిందో తెలిసిందే. రెండు కూడా ఇంకా షూటింగ్ దశలోనే ఉండటం సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం కాకపోవడంతో ఇప్పట్లో రిలీజ్ సాధ్యమేనా? అన్న బలమైన ప్రచారం సాగింది. కచ్చితంగా రెండు సినిమాలు వాయిదా పడటం ఖాయ మని...సమ్మర్ లో రిలీజ్ కష్టమేనని మెజార్టీ వర్గం భావించింది.
అయితే మేము మాత్రం తగ్గేదేలే అంటూ పుష్ప-2 టీమ్ నిన్నటి రోజున క్లారిటీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. మరో 200 రోజుల్లో వచ్చేస్తాం..మీరు రెడీగా ఉండండి అంటూ అధికారికంగా పోస్టర్ వేసి మరి చెప్పేసారు. అంటే రిలీజ్ విషయంలో సుకుమార్ ప్లానింగ్ లో ఎలాంటి మార్పులేదని తెలిపోయింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15న తమ చిత్రం తప్పకుండా వచ్చేస్తుం దని క్లారిటీ ఇచ్చేసారు.
ఎట్టి పరిస్థితుల్లో సినిమాకి సంబంధించిన అన్ని పనులు 200 రోజుల్లో పూర్తి చేసి ప్రేక్షకుల మధ్యలో ఉంటామని చెప్పేసారు. రీషూట్లు ఉన్నా..రీరైట్ లు ఉన్నా ఏం ఉన్నా సరే ఆగస్టు 15 రిలీజ్ తధ్యం అని తేలి పోయింది. అలాగే 'కల్కి 2898` రిలీజ్ విషయంలోనూ నాగ్ అశ్విన్ ఎక్కడా తగ్గడం లేదని తెలు స్తోంది. ఉన్న సమయం మూడు నెలల్లో షూటింగ్ సహా అన్ని పనులు పూర్తి చేసి మే 9న వచ్చేయడం ఖాయమని సన్నిహితుల వద్ద అంటున్నారు.
ఇప్పటికే డిలే అయిన నేపథ్యంలో ఇకపై ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేసే ఛాన్స్ లేదని గట్టిగానే చెబుతు న్నారుట. దీంతో రెండు పాన్ ఇండియా చిత్రాలు ముందుగా ప్రకటించిన తేదీకే వచ్చేస్తాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ రెండు చిత్రయూనిట్ లు షూటింగ్ పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నారు.