కాక పుట్టించే బ్యూటీ క్రేజీ ఛాన్సుల‌కు దూరంగా!

యంగ్ బ్యూటీ ఇవానా గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అమ్మ‌డు 'ల‌వ్ టుడే' సినిమాతో తెలుగు నాట బాగా ఫేమ‌స్ అయింది.

Update: 2025-02-12 07:30 GMT

యంగ్ బ్యూటీ ఇవానా గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అమ్మ‌డు 'ల‌వ్ టుడే' సినిమాతో తెలుగు నాట బాగా ఫేమ‌స్ అయింది. యూత్ పుల్ ల‌వ్ స్టోరీతో యువ‌త‌కి బాగా రీచ్ అయింది. 'లవ్ టుడే' త‌మిళ అనువాద చిత్ర‌మైనా స‌క్సెస్ ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. దీంతో తెలుగులో మంచి కెరీర్ ఉంటుంద‌ని అంతా భావించారు. కానీ అమ్మ‌డి కెరీర్ మాత్రం అలా సాగ‌డం లేదు. 'ల‌వ్ టుడే' త‌ర్వాత తెలుగులో ఓ సినిమాకి సైన్ చేసింది.

అదే 'సెల్పిష్'. దిల్ రాజు త‌మ్ముడు కుమారుడు అశిష్ రెడ్డి హీరోగా మొద‌లైన ప్రాజెక్ట్ ఇది. అయితే ఈసినిమా ప్రారంభ‌మై చాలా కాల‌మ‌వుతుంది. ఇంకా ఈ సినిమా సెట్స్ లోనే ఉంది. దిల్ రాజుసొంత నిర్మాణ సంస్థ‌లోనే ప‌ట్టాలెక్కించిన చిత్ర‌మిది. అయితే ఇదే స‌మ‌యంలో రాజుగారు కొన్ని భారీ బ‌డ్జెట్ చిత్రాలు కూడా ప‌ట్టా లెక్కించారు. దీంతో నిర్మాణ ప‌రంగా ఇబ్బందులు త‌లెత్త‌డంతో సెల్పిష్ ని తాత్కాలికంగా వాయిదా వేసారు.

అయితే ఈ వాయిదా అన్న‌ది అశిష్ స‌హా ఇవానా కెరీర్ పై కూడా ప్ర‌భావం ప‌డింది. ఇద్ద‌రు ఆ ప్రాజెక్ట్ బాండ్ అయి ఉన్నారు. కొత్త సినిమా అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో గ్యాప్ ఏర్ప‌డింది. అశిష్ సంగ‌తి ప‌క్క‌న బెడితే? ఇవానాకి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. న‌టిగా తొలి సినిమాతోనే ప్రూవ్ చేసుకుంది. ఈనేప‌థ్యంలో తెలుగులో పెద్ద హీరోయిన్ అవుతుంది అన్న అంచ‌నాలు సైతం తెర‌పైకి వ‌చ్చాయి. కానీ సెల్పిష్ ఇంకా సెట్స్లోనే ఉండ‌ట‌తో కొత్త ఛాన్సులు రాలేదు.

అటు త‌మిళ్ లో కూడా అవ‌కాశాలు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌త ఏడాది ఒక్క సినిమాతోనే ప్రేక్ష‌కుల ముందు కొచ్చింది. మాలీవుడ్ లో కూడా సినిమాలు చేయ‌లేదు. తొలుత కెరీర్ అక్క‌డే ప్రారంభించింది. అటుపై మ‌రింత మెరుగైన కెరీర్ కోసం కోలీవుడ్ లో లాంచ్ అయింది. అక్క‌డ బాగానే ఫేమ‌స్ అయింది. అక్క‌డ నుంచి టాలీవుడ్ కి షిప్ట్ అయితే మొద‌టి కే మోసం వ‌చ్చింది. ఇలా ఇవానా కెరీర్ డే బై డే మ‌రింత నెమ్మ‌దిస్తుంది.

( ఇవానా ట్యాలెంటెడ్ న‌టి. కానీ బిజీ కాలేక‌పోతుంది. తెలుగులో సెల్పిష్లో న‌టిస్తోంది. ఆసినిమా ఇంకా సెట్స్ లోనే)

Tags:    

Similar News