పారగాన్ హవాయి చెప్పల్స్ తో ...కొచ్చిలో అడుగుపెట్టిన డిప్యూటీ సీఎం... షెడ్యూల్ ఇదే!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు బయలుదేరిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు బయలుదేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన.. కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా.. ఈ పర్యటనలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్య క్షేత్రాలు దర్శించుకునే యాత్రకు నేడు శ్రీకారం చుట్టారు.
అవును... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తన దక్షిణాది యాత్రలో భాగంగా... కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తొలుత కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని మొదట దర్శించుకోనున్నారు. నేటి నుంచి దక్షిణాదిలో పలు ఆలయాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సందర్శించనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా... అనంత పద్మనాభ స్వామి, శ్రీ పరసురామ స్వామి, మధుర మీనాక్షి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణేశ్వర స్వామి ఆలయాలను సందర్శించనున్నారు. ఇప్పటికే సనాతన బోర్డు ఏర్పాటుకు పవన్ కల్యాణ్ సంకల్పించిన నేపథ్యంలో.. ఆ సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగానే ఈ పర్యటన అని చెబుతున్నారు.
మరోపక్క.. పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా గతంలో మొక్కుకున్న పలు మొక్కులను తీర్చుకోనున్నారని అంటున్నారు.
మరోపక్క ఏపీ రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులతో సీఎం చంద్రబాబు నిర్వహించిన కీలక సమావేశానికి పవన్ కల్యాణ్ గైర్హాజరైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ.. పవన్ కల్యాణ్ రెండు వారాలుగా తీవ్రమైన నడుమునొప్పితో బాధపడుతున్నారని, అందుకే సమావేశానికి రాలేదని తెలిపారు!