35 లక్షలు కాదు మూడు రెట్లు ఎక్కువిచ్చారు!
వినాయకన్ అలియాస్ వర్మ ఇప్పుడెంత ఫేమస్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. `జైలర్` విజయంతో వినాయకన్ పేరు మారుమ్రోగిపోతుంది.
వినాయకన్ అలియాస్ వర్మ ఇప్పుడెంత ఫేమస్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. `జైలర్` విజయంతో వినాయకన్ పేరు మారుమ్రోగిపోతుంది. సాధారణ కమెడియన్ గామొదలైన వినయకన్ ఇప్పుడు మోస్ట్ వాంటెండ్ విలన్ గా మారిపోయాడు. మలయాళంలో చాలా సినిమాలు చేసాడు కానీ..తమిళ్ లో వచ్చిన గుర్తింపు మాత్రం చాలా ప్రత్యేకమైనది. మెయిన్ విలన్స్ పక్కన కామెడీ విలన్ గా నటించిన వినాయకన్ ఇప్పుడు మెయిన్ విలన్ గా మారిపోయాడు.
కోలీవుడ్ లో చేసింది కొన్ని సినిమాలే అయినా టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కింది. అనువాద రూపంలో అక్కడి సినిమాలు ఇక్కడికి రావడంతోనే సాధ్యమైంది. ఇకపై వినాయకన్ కి టాలీవుడ్ పిలిచి మరీ అవకాశం ఇస్తుందనడంలో సందేహం లేదు. నటుల్ని తయారు చేయడం కన్నా! తయారైన నటుడ్ని తీసుకోవడం ఈజీ అన్న లాజిక్ టాలీవుడ్ ఎక్కువగా ఫాలో అవుతుంది. అందుకే సొంత భాషల వాళ్లకి అవకాశాలివ్వడం కన్నా! పర భాష నటుల్ని తీసుకురావడంలో ముందుంటారు.
ఆ సంగతి పక్కనబెడితే జైలర్ లో నటించిన నటీనటులందరికీ నిర్మాత కళానిధి మారన్ భారీ లాభాలు రావడంతో ముందు ఇచ్చిన పారితోషికాల కంటే మళ్లీ అదనంగానూ కొంత చెల్లించిన సంగతి తెలిసిందే. కొంత మందికి ఖరీదైన కార్లను సైతం బహుమతులుగా ఇచ్చారు. మరి వినాయకన్ ఈ సినిమాకి ఎంత తీసుకున్నాడంటే? మూడు రెట్లు అధిక పారితోషికం అందుకున్నారుట. తొలుత వినాయక్ ని 35 లక్షలే ఇచ్చారని ప్రచారం సాగింది.
ఎందుకంటే వినాయకన్ ఫేమస్ నటుడేం కాదు. దీంతో ఆ స్థాయి నటులకు ఇవ్వాల్సినంతే ఇచ్చారని వినిపించింది. అయితే వినాయకన్ మాత్రం మీరు ఊహించిన దానంకటే మూడు రెట్లు అధిక పారితోషికం అందుకున్నట్లు తెలిపాడు. జైలర్ లో రజనీకాంత్ పాత్ర ఎంత కీలకమైనదో వినాయకన్ పాత్ర అంతే కీలకమైనది. తనదైన శైలి నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. కడుపుబ్బా నవ్వించాడు. సినిమాలో వినాయకన్ ఎక్కడా నటిస్తున్నట్లు ఉండదు. చాలా నేచురల్ పెర్పార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇది దర్శకుడు నెల్సన్ వల్లే సాధ్యమైందని వినాయకన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.