ఆలియా క్రేజ్ ముందు జాన్వీ నిల‌వ‌లేదు

ఇంత‌లోనే రామ్ చ‌ర‌ణ్ త‌దుప‌రి సినిమా ప్రీప్రొడ‌క్ష‌న్, కాస్టింగ్ ఎంపిక‌లు జ‌రుగుతున్నాయి.

Update: 2024-01-25 23:30 GMT

ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ పూర్తిగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలోని `గేమ్ ఛేంజ‌ర్`పై దృష్టి సారించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో విభిన్న వేష‌ధార‌ణ‌లు, వైవిధ్య‌మైన ఆహార్యంతో అల‌రించ‌నున్నాడు. త‌న కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్సెస్ ని అందించ‌నున్నాడ‌ని టాక్ ఉంది. అక్టోబ‌ర్ లో గేమ్ ఛేంజ‌ర్ విడుద‌ల కానుంది.

ఇంత‌లోనే రామ్ చ‌ర‌ణ్ త‌దుప‌రి సినిమా ప్రీప్రొడ‌క్ష‌న్, కాస్టింగ్ ఎంపిక‌లు జ‌రుగుతున్నాయి. త‌దుప‌రి బుచ్చిబాబుతో సినిమా కోసం చ‌ర‌ణ్‌ స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. ఇది స్పోర్ట్స్ గ్రామీణ నేప‌థ్యంలో సాగే సినిమా. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ పాత్ర ఛాలెంజింగ్ గా ఉంటుంద‌ని స‌మాచారం. అత‌డికి క‌థానాయిక‌గా ఎవ‌రిని ఎంపిక చేయ‌నున్నారు? అన్న‌ది స‌స్పెన్స్ గా మారింది. ఇటీవ‌ల ఆలియా, జాన్వీ క‌పూర్ పేర్లు బ‌లంగా వినిపిస్తున్నాయి. అయితే ఆ ఇద్ద‌రిలో ఆలియాకే ఎక్కువ‌గా ఛాన్స్ ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఆలియా ఇంత‌కుముందు చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఆర్.ఆర్.ఆర్ లో సీత‌గా న‌టించి మెప్పించింది. ఇప్ప‌టికే సౌత్ కి సుప‌రిచితురాలు.

దానికి తోడు ఆలియాకు ఉన్న అసాధార‌ణ ట్రాక్ రికార్డ్ ని మేక‌ర్స్ ప‌రిశీలిస్తున్నారు. ఆలియా సీనియారిటీకి కూడా ప్రాధాన్య‌త ఉంది. ఈ ట్యాలెంటెడ్ బ్యూటీ ఇమేజ్ ముందు జాన్వీ క‌పూర్ ను ఇంకా అప్ క‌మ్ న‌టిగానే ప‌రిగ‌ణించాలి. అందువ‌ల్ల‌నే ఇప్పుడు జాన్వీకంటే ఆలియాకే ఎక్కువ స్కోప్ ఉంద‌ని టాక్ వినిపిస్తోంది. ఆలియా చేరిక‌తో త‌మ ప్రాజెక్టుకు పాన్ ఇండియా అప్పీల్ వ‌స్తుంద‌న్న భావ‌న కూడా ఉంది. అందుకే చ‌ర‌ణ్ -బుచ్చి బాబు సినిమాకి తొలి ఆప్ష‌న్ ఆలియా భ‌ట్.. జాన్వీ క‌పూర్ కు సెకండ్ ప్ర‌యారిటీ మాత్ర‌మే ఉంటుంద‌ని తెలుస్తోంది.

ఇటీవ‌ల బుచ్చిబాబు టీమ్ ఆలియాను సంప్ర‌దించ‌గా, అట్నుంచి పాజిటివ్ సైన్ ఉంద‌ని కూడా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వాసన్ బాలాతో జిగ్రా షూటింగ్‌లో బిజీగా ఉంది. ఇందులో ఆలియా ప్రధాన పాత్ర పోషిస్తుండగా, తన సొంత నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్‌ ఈ చిత్రానికి సహ నిర్మాణ సంస్థ‌గా వ్యవహరిస్తోంది. భారీ అంచనాలున్న ఈ చిత్రం సెప్టెంబర్ 2024లో థియేటర్లలోకి రానుంది. ఆలియా త‌దుప‌రి సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో నటించ‌నుంది.


Tags:    

Similar News