నా వల్ల కాదని ఏడ్చిన సందర్భం...!

సినిమా ప్రమోషన్ లో భాగంగా జాన్వీ కపూర్ మాట్లాడుతూ ఈ సినిమా కోసం తాను చాలా కష్టపడ్డట్లుగా చెప్పుకొచ్చింది.

Update: 2024-06-07 11:30 GMT
నా వల్ల కాదని ఏడ్చిన సందర్భం...!
  • whatsapp icon

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌ లో ఇప్పటికే పలు సినిమాలు చేసింది. కానీ ఏ ఒక్క సినిమా కూడా కమర్షియల్‌ గా బిగ్‌ హిట్ ను అందుకోవడంలో సక్సెస్‌ అవ్వలేదు. అయినా కూడా ఈ అమ్మడికి ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.

తాజాగా ఈ అమ్మడు నటించిన హిందీ సినిమా మిస్టర్ అండ్ మిసెస్‌ మహి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా జాన్వీ కపూర్ మాట్లాడుతూ ఈ సినిమా కోసం తాను చాలా కష్టపడ్డట్లుగా చెప్పుకొచ్చింది. ముఖ్యంగా క్రికెట్‌ సన్నివేశాల కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లుగా పేర్కొంది.

మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ ప్రమోషన్ లో భాగంగా జాన్వీ కపూర్ మాట్లాడుతూ... గతంలో ఎప్పుడు లేనంతగా ఈ సినిమా కోసం కష్టపడ్డాను. ముఖ్యంగా క్రికెటర్ గా కనిపించేందుకు చాలా నెలల పాటు ఆట నేర్చుకున్నాను. ఆ సమయంలో క్రికెట్‌ ప్రాక్టీస్ చేయడం నా వల్ల కాదని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి.

క్రికెట్‌ ప్రాక్టీస్‌ కోసం చాలా కాలం కష్టపడ్డాం. ప్రాక్టీస్ నా వల్ల కాదని ఏకంగా సినిమా నుంచి తప్పుకోవాలని కూడా అనుకున్నట్లుగా చెప్పుకొచ్చింది. హీరోయిన్‌ గా తాను చేసే ప్రతి సినిమా కూడా చాలా విభిన్నంగా ఉండాలని కోరుకుంటాను. అందులో భాగంగానే ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి పాత్ర విభిన్నంగా ఉండేలా ఎంపిక చేసుకున్నాను అంది.

ప్రస్తుతం తెలుగు లో ఎన్టీఆర్‌ తో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. దేవర సినిమా రెండు పార్ట్‌ లుగా రాబోతుంది. దేవర సినిమా ఇంకా షూటింగ్‌ దశలో ఉండగానే ఇటీవలే బుచ్చి బాబు దర్శకత్వంలో రూపొందుతున్న చరణ్‌ మూవీలో కూడా జాన్వీ కపూర్ ఎంపిక అయిన విషయం తెల్సిందే.

Tags:    

Similar News