జాన్వీ కపూర్ కి చుక్కలు చూపించిన సినిమా ఇదే!
తాజాగా జాన్వీకపూర్ నటించిన 'మహి అండ్ మిసెస్ మహీ' కోసం ఆమె ఎంతగా కష్టపడిందో రివీల్ చేసింది. 'ఈ సినిమా కోసం రెండేళ్ల పాటు క్రికెట్ లో ట్రైనింగ్ తీసుకున్నా.
సినిమా కోసం హీరోయిన్లు..హీరోలు ఎంతగా కష్టపడతారో చెప్పాల్సిన పనిలేదు. పాత్రల్ని బట్టి కష్టం అనేది ఆధారపడి ఉంటుంది. కొన్నిసినిమాల కోసం ప్రత్యేకంగా ముందే రకరకాల అంశాలపై శిక్షణ తప్పని సరి అవుతుంది. ప్రాజెక్ట్ ప్రారంభం కావడానికి నాలుగైదు నెలలు ముందు నుంచే అవసరమైన ట్రైనింగ్ తీసుకుంటారు. అటుపై ఆ ట్రైనింగ్ అంతా అన్ సెట్స్ లో పెర్పార్మెన్స్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎంత కష్టమైనా...కఠినమైనా పడటానికి ఇష్టంతో ఆసక్తి చూపిస్తుంటారు.
మధ్యలో డ్రాప్ అవ్వడం అనే ఆలోచన లేకుండా పనిచేస్తుంటారు. తాజాగా జాన్వీకపూర్ నటించిన 'మహి అండ్ మిసెస్ మహీ' కోసం ఆమె ఎంతగా కష్టపడిందో రివీల్ చేసింది. 'ఈ సినిమా కోసం రెండేళ్ల పాటు క్రికెట్ లో ట్రైనింగ్ తీసుకున్నా.
దర్శకుడు శరణ్ శర్మ ఏసినిమాలోనైనా నాణ్యత కోరుకుంటారు. క్రికెట్ నేపథ్యం కావడంతో తప్పకుండా క్రికెట్ నేర్చుకోవాల్సిందేనని ఆదేశించారు. ఎలాంటి వీఎఫ్ ఎక్స్ లు వాడను. అంతా నీ మీదనే ఆధారపడి ఉంటుదన్నారు.
దీంతో శిక్షణ సమయంలో ఎన్నో దెబ్బలు తగిలాయి. భుజాలు డిస్ లొకేట్ అయ్యాయి. ఆ బాధ భరించలేక సినిమా వదిలేద్దాం అన్న ఆలోచన కూడా వచ్చింది. కానీ నేను క్రికెట్ ఆడగలని ధైర్యాన్ని నింపింది అభిషేక్ నాయర్.. విక్రాంత్ మాసే సర్. వాళ్ల ప్రోత్సాహంతోనే ఆట నేర్చుకోగలిగాను. బాగా పెర్పార్మ్ చేయగలిగాను అనుకుంటున్నా. ఇప్పటివరకూ ఏ సినిమా కోస ఇంతగా కష్టపడలేదు. చాలా సినిమాలు చేసాను. కానీ కఠినమైన రోల్ ఏది? అంటే అది ఇదేనని చెప్పగలను.
రాత్రి పగలు తేడా లేకుండా పనిచేసిన సినిమా కూడా ఇదే. కష్టమంటే ఎలా ఉంటుందో బాగా అర్దం చేసిన చిత్రం కూడా ఇదే. ఇందులో మహిమ ఆరు నెంబర్ గల జెర్సీ వేసుకుంటుంది. ఏడు నెంబరు తీసుకోవాలనుకున్నాం. కానీ ఆ నెంబర్ కేవలం ధోని కి మాత్రమే అంకితమని ఆ ఛాయిస్ తీసుకోలేదు. ఆరు నా లక్కీ నెంబర్ కూడా. ఈ సినిమాకి ఆ అదృష్టం కూడా కలిసొస్తుందని నమ్ముతున్నా' అని తెలిపింది.