రాజ‌మండ్రి రాగ‌మంజ‌రిలా జాన్వీక‌పూర్!

అమ్మ‌డు ముస్తాబైన విధానం..పెర్పార్మెన్స్ తో అదే రేంజ్ లో అద‌ర‌గొ ట్టిన‌ట్లు తెలుస్తోంది.

Update: 2024-01-30 07:45 GMT

'రాజ‌మండి రాగ‌మ‌జంరి మా అమ్మ పేరు తెల‌వ‌నోళ్లు లేరు మేస్త్రీ... క‌ళాకార్ల‌ ఫ్యామిలీ మ‌రి.. నే గ‌జ్జె క‌డితే నిదుర‌పోదు నిండు రాతిరి...సోకులాడి స్వ‌ప్న సుంద‌రి.. నీ మ‌డ‌త చూపు మాప‌టేల మ‌ల్లె పందిరి..ర‌చ్చ రాజుకుందే మోపిరి.. నీవంక చూస్తే గుండెలోనే డీరి డిరీ` అన్న కుర్చీ మ‌డ‌త సాంగ్ అందుకోవాల్సిందే జాన్వీ క‌పూర్ ని ఇలా చూస్తుంటే. అమ్మ‌డు ముస్తాబైన విధానం..పెర్పార్మెన్స్ తో అదే రేంజ్ లో అద‌ర‌గొ ట్టిన‌ట్లు తెలుస్తోంది.


69వ ఫిల్మ్ ఫేర్ వేడుక‌ల్లో భాగంగా బాలీవుడ్ బ్యూటీలంతా లైవ్ పెర్పార్మెన్స్ తో అల‌రించిన సంగ‌తి తెలిసిందే. అందులో అంతిలోక సుంద‌రి శ్రీదేవి స్వీట్ డాట‌ర్ జాన్వీపూర్ కూడా స్టేజ్ పెర్పార్మెన్స్ ఇ చ్చింది. త‌నకు ఇష్ట‌మైన పాట‌ల‌న్నింటికీ డాన్సు చేసి అమ్మ‌డు ఆక‌ట్టుకుంది. వాటిలో నుంచి లీకైన ఈ స్టిల్ చూస్తుంటే రాజ‌మండ్రి రాగ‌మంజరి...క‌ళాకార్ల ఫ్యామిలీనే త‌ల‌పిస్తుంది మ‌రి.


టాప్ టూ బాట‌మ్ అమ్మ‌డు ధ‌రించిన దుస్తుల్లో అంతే వేడి పుట్టిస్తున్నాయి. మిరుమిట్లు గొలిపే గులాబీ రంగు స్క‌ర్ట్.. బ్లౌజ్ ప్ర‌తీది జాన్వీలో మాస్ అప్పిరియ‌న్స్ ని తీసుకొచ్చింది. అమ్మ‌డి సిగ్నెచ‌ర్ స్టెప్పులు మాస్ బీట్ కి ప‌ర్పెక్ట్ గా మ్యాచ్ అయిన‌ట్లు క‌నిపిస్తుంది. ముఖంలో జాన్వీ ఎక్స్ ప్రెష‌న్స్..మూతి బిగింపు మాస్ లో విజిల్స్ వేయించేలా ఉంది. అయితే వేదిక‌పై జాన్వీ బాలీవుడ్ ఐకానిక్ పాట‌ల‌కు డాన్సు చేసి మెప్పించింది.


ఈ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసి త‌న అభిప్రాయాన్ని కూడా పంచుకుంది. `నాకు చాలా ఇష్టమైన మరియు అత్యంత ప్రసిద్ధ హిందీ సినిమా క్వీన్స్ పాటలపై నృత్యం చేయడం నాకు ఎంత గొప్పగా..గ‌ర్వంగా అని పించింది. ఎంతటి గౌరవం ద‌క్క‌డం అదృష్టంగా భావిస్తున్నాను అంటూ రాసుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. జాన్వీ అభిమానులు చూసి అంతే ఆస్వాదిస్తున్నారు.


Tags:    

Similar News