జాన్వీ పీకాక్ లుక్ వైరల్
ముఖ్యంగా సోషల్ మీడియాల్లో జాన్వీకి ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే.
నేటితరం అందాల యువనాయిక జాన్వీకపూర్ పరిచయం అవసరం లేదు. అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలిగా సినీఆరంగేట్రం చేసిన జాన్వీ తనదైన అందం నటనతో మంత్రముగ్ధులను చేస్తోంది. నటించిన కొద్ది సినిమాలతోనే మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు దేవర సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది.
ముఖ్యంగా సోషల్ మీడియాల్లో జాన్వీకి ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. తాజాగా జాన్వీ కపూర్ సోషల్ మీడియాల్లో షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ఇందులో నెమలి పింఛముల డిజైనర్ లెహంగాలో హొయలొలికిస్తూ కనిపించింది జాన్వీ. నిజంగా నెమలి నడిచొచ్చినట్టుగా ఉంది! అంటూ అభిమానులు మైమరిచి చూస్తున్నారు ఈ లుక్ ని. ఈ డిజైన్ నిజానికి జాన్వీకి యూనిక్ లుక్ తెచ్చింది. ఇక జాన్వీ ధరించిన టాప్ ఎంతో ట్రెండీగాను కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటిఫుల్ డిజైనర్ లుక్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.
అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలు జాన్వీ కపూర్ త్వరలో టాలీవుడ్ లో అడుగుపెట్టబోతోంది. కెరీర్ ఆరంభమే టాలీవుడ్ సూపర్ స్టార్లు ఎన్టీఆర్, చరణ్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. దేవరలో ఎన్టీఆర్ తో రొమాన్స్ చేస్తున్న జాన్వీ, తదుపరి చరణ్ - బుచ్చిబాబు చిత్రంలోను నటిస్తోంది. జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ తెరకెక్కిస్తే అందులో కచ్ఛితంగా జాన్వీ కథానాయిక అని చరణ్ కన్ఫామ్ చేసాడు. దీనికోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారని బుచ్చిబాబుతో సినిమా లాంచ్ లో చరణ్ స్వయంగా అన్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... జాన్వీ కపూర్ తదుపరి ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. ఇంతలోనే రామ్ చరణ్ సరసన బుచ్చిబాబు చిత్రంలో నటించే రేర్ ఛాన్స్ కొట్టేసింది. జాన్వీ ఇప్పుడు కోలీవుడ్ లోను అడుగుపెట్టబోతున్నట్టు కథనాలొస్తున్నాయి. ప్రతిభావంతుడైన సిలంబరసన్ అలియాస్ శింబు సరసన STR 48తో కోలీవుడ్ లో అరంగేట్రం చేస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. శింబు తన తదుపరి చిత్రం కోసం దర్శకుడు దేశింగ్ పెరియసామితో కలిసి పని చేస్తున్నాడు. ఈ చిత్రానికి తాత్కాలికంగా STR 48 అని పేరు పెట్టారు. ఏడాది క్రితమే ప్రారంభమైన ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనికి ఎక్కువ సమయం పట్టింది.