మొదటి చిత్రానికి రూ.10 పారితోషికం అందుకున్న నటి

జయప్రద ఒక తెలుగు సినిమా ఫైనాన్షియర్ ఇంట్లో జన్మించింది. చిన్నప్పటి నుండి షోబిజ్ వైపు మొగ్గు చూపడానికి కారణం ఇదే.

Update: 2023-09-18 16:30 GMT

మొదటి సినిమాకి రూ.10 పారితోషికం అందుకున్న న‌టి ఆ త‌రవాత భార‌తీయ చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నంబ‌ర్ వ‌న్ న‌టిగా కీర్తినందుకుంది. అత్యంత భారీ పారితోషికం అందుకునే భార‌తీయ‌ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఒక తెలుగు సినిమా ఫైనాన్షియర్ ఇంట్లో జన్మించిన‌ ఆమె చిన్నప్పటి నుండి షోబిజ్ వైపు మొగ్గు చూపింది. సినీవినీలాకాశంలో గొప్ప ఎత్తుల‌కు ఎదిగింది. రాజ‌కీయాల్లోను రాణించింది. ఇంత‌కీ ఎవ‌రా న‌టి? అంటే.. మేటి ప్ర‌తిభావ‌ని, అగ్ర క‌థానాయిక‌ జ‌య‌ప్ర‌ద గురించే ఇదంతా.

తాజాగా మేటి న‌టి జ‌య‌ప్ర‌ద‌ చిన్ననాటి ఫోటో ఇంటర్నెట్ లో సంచ‌ల‌నంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలో జ‌య‌ప్ర‌ద ఎంతో క్యూట్ గా క‌నిపిస్తోంది. త‌న‌దైన‌ అందం, డ్యాన్స్, నటనా నైపుణ్యాల తో 80 లు 90 లలో అందరి దృష్టిని ఆకర్షించిన జ‌య‌ప్ర‌ద కోసం ప‌రిశ్ర‌మ ఎంతో వేచి చూసేది. త‌న‌తో కలిసి పనిచేయాలనేది ప్రతి సినిమా నిర్మాత కల. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, జీతేంద్ర వంటి అగ్ర హీరోలతో కలిసి పనిచేసింది. ఆమె బాలీవుడ్‌తో పాటు సౌత్ సినిమాల్లోనూ అసాధార‌ణ విజయాల‌ను సాధించింది. కేవలం 12 సంవత్సరాల వయస్సులో నటిగా కెరీర్ ప్రారంభించి తన మొదటి చిత్రానికి కేవలం 10 రూపాయలు మాత్రమే తీసుకున్న అలనాటి సూపర్ స్టార్ జయప్రద అస‌మాన ప్ర‌తిభ ఎప్ప‌టికీ చిర‌స్మ‌ర‌ణీయం.

జయప్రద ఒక తెలుగు సినిమా ఫైనాన్షియర్ ఇంట్లో జన్మించింది. చిన్నప్పటి నుండి షోబిజ్ వైపు మొగ్గు చూపడానికి కారణం ఇదే. జయప్రద చాలా చిన్న వయస్సు నుండి శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడం ప్రారంభించింది. బాల్యంలో సినీ రంగప్రవేశం చేసింది. జయప్రద తన ప్రతిభ ఆధారంగా చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోవడంలో విజయం సాధించింది. తెలుగు సినిమా నుండి తన నటనా జీవితాన్ని ప్రారంభించిన జయప్రద బాలీవుడ్‌లోకి ప్రవేశించి మంచి విజయాన్ని అందుకుంది. జయప్రద అనతికాలంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా అవతరించింది. జితేంద్ర స‌ర‌స‌న వ‌రుస చిత్రాల్లో న‌టించి పేరు తెచ్చుకుంది. ఇద్దరూ కలిసి అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించారు. జయప్రద తన అద్భుతమైన నటనకు అనేక అవార్డులను కూడా గెలుచుకుంది.

జయప్రద తన కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు సినీ నిర్మాత శ్రీకాంత్ నహతాను వివాహం చేసుకుంది. శ్రీకాంత్ నహతాకు అప్పటికే వివాహమైంది. అతని మొదటి భార్యకు ముగ్గురు పిల్లలు ఉన్నందున ఈ వివాహం ఆ సమయంలో హెడ్ లైన్స్ లో నిలిచింది. జయప్రదను పెళ్లాడిన తర్వాత కూడా శ్రీకాంత్ నహతా తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు. పెళ్లి తర్వాత జయప్రద నటనను వదులుకోలేదు కానీ ప‌రిశ్ర‌మ‌లో నిర్మాతలు ఆమెను పక్కన పెట్టడం ప్రారంభించారు. ఇది త‌న‌ కెరీర్‌కు ముగింపుగా మారింది. శ్రీకాంత్ నహతా తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి నిరాకరించాడు. ఇది జయప్రదతో అతని రిలేష‌న్‌షిప్ కి చాలా ఇబ్బందులు సృష్టించిందని టాక్ ఉంది.

Tags:    

Similar News