ప్రేమ కోసం సినిమాలు త్యాగం.. ప్రేమతో సినిమాకు న్యాయం..!

అది అర్థం చేసుకున్న లిండా సినిమాల్లోకి వెళ్లమని చెప్పిందట. అలా జీతూ జోసెఫ్ సినీ ప్రయాణం మొదలైంది.

Update: 2024-02-05 03:00 GMT

నిజ జీవిత కథలే కొన్ని సినిమాలుగా తీస్తుంటారు. కానీ కొంతమంది దర్శకుల జీవితాలు కూడా అదేదో సినిమా కథలానే అనిపిస్తుంది. మలయాళ స్టార్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ పెళ్లి ప్రేమ, సినిమా ఈ రెండిటి మీద ఆధారపడింది. ఒకటి కావాలంటే మరోటి వదులుకోవాలి.. ఆ టైం లో ప్రేమకే ఓటేసిన ఆయన ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకున్నాడు. కానీ సినిమాలకు దూరమయ్యాడు. అయితే ఆమె అతని ప్రేమను అర్థం చేసుకోవడమే కాదు సినిమాల మీద అతని ఇష్టాన్ని గుర్తించి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కట్ చేస్తే అతనొక స్టార్ డైరెక్టర్ అయ్యాడు.

 

ఇదేదో అచ్చం సినిమా కథలా ఉన్నా జరిగింది ఇదే. జీతు జోసెఫ్ తండ్రి కేరళలో ఒక రాజకీయ వేత్త. ఎమ్మెల్యేగా మంచి పలుకుబడి ఉన్న కుటుంబం. ఇంటర్ టైం నుంచే జీతూ జోసెఫ్ కి సినిమాలంటే పిచ్చి. ఆ టైం లో సినిమాలపై ఉన్న ఇష్టాన్ని చెబితే డిగ్రీ పూర్తి చేయమని అన్నారట. అలా డిగ్రీలో ఉండగా ఒకసారి చర్చిలో లిండా అనే అమ్మాయిని చూసి మనసు ఇచ్చేశాడు. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి ప్రేమ విషయాన్ని చెప్పాడు. ఆ అమ్మాయి పెద్దగా పట్టించుకోలేదు అయితే ఈసారి జీతు జోసెఫ్ తన ఇంట్లో వాళ్లని తీసుకెళ్లి ఆ అమ్మాయి ముందు నిలబెట్టాడు.

ఆ టైం లో లైఫ్ లో ఏం చేస్తావ్ అని లిండా అడిగితే సినిమాల్లోకి వెళ్తా అన్నాడట . అయితే సినిమా వాళ్లంటే మా ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. నేను కావాలా సినిమా కావాలా అని అడిగేసిందట. ఆ టైం లో ఏమి చేయలేక ప్రేమించిన అమ్మాయి కోసం సినిమాలను వదిలేశాడు జీతూ జోసెఫ్. ఆఫ్టర్ మ్యారేజ్ బిజినెస్ చేసుకుంటున్నా సినిమాల్లోకి వెళ్లలేదనే బాధ తనలో ఉంది.

అది అర్థం చేసుకున్న లిండా సినిమాల్లోకి వెళ్లమని చెప్పిందట. అలా జీతూ జోసెఫ్ సినీ ప్రయాణం మొదలైంది. ఒక డైరెక్టర్ దగ్గర సహ దర్శకత్వం చేసి ఆ తర్వాత ఒక కథ రాసుకుని సినిమా స్టార్ట్ చేద్దామనుకుంటే సినిమా ఆగిపోయిందట. సురేష్ గోపీతో కథ చెప్పి ఓకే చేసుకున్నా నిర్మాత లేకపోవడంతో వాళ్ల అమ్మ ఇచ్చిన ఆస్తి అమ్మి సినిమా తీశాడట. అలా తీసిన సినిమా ఘన విజయం సాధించింది. జీతూ జోసెఫ్ కి మంచి పేరు వచ్చింది.

కెరీర్ లో 17 సినిమాలు తీసిన జీతూ జోసెఫ్ 13 సినిమాలను హిట్ చేసుకున్నాడు. మోహన్ లాల్ జీతూ జోసెఫ్ కాంబో అంటే అది సూపర్ హిట్ అన్నట్టే లెక్క. దృశ్యం తో మొదలైన వీరు హిట్ కాంబో రీసెంట్ గా వచ్చిన నెరుతో మరోసారి ప్రూవ్ అయ్యింది. తెలుగులో దృశ్యం 2 సినిమాను జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేశారు. తెలుగులో ఆయన తీసిన సినిమా అదొక్కటే. ప్రేమ వల్ల సినిమాలకు దూరమై మళ్లీ అదే ప్రేమ ప్రోత్సాహంతో సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అవ్వడం చూస్తుంటే జీతూ జోసెఫ్ ఎంత లక్కీ అన్నది తెలుస్తుంది.




 


Tags:    

Similar News