చూడను కానీ నటిస్తా!
తాను హారర్, హింసాత్మక సినిమాలు చూడను కానీ, నటిస్తానని అంటోంది ఆండ్రియా జెరోమియా
తాను హారర్, హింసాత్మక సినిమాలు చూడను కానీ, నటిస్తానని అంటోంది ఆండ్రియా జెరోమియా. ఇప్పుడు ఆండ్రియా నటించిన హారర్ థ్రిల్లర్ విడుదలకు రావాల్సి ఉండగా ఊహించని ట్విస్టు ఎదురైంది. వివరాల్లోకి వెలితే..
నటి, గాయని కం డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆండ్రియా జెరెమియా నటించిన 'కా ది ఫారెస్ట్' అడ్వెంచర్ థ్రిల్లర్ విడుదలకు సిద్ధమవుతోంది. దీనికి నాంజిల్ దర్శకత్వం వహించారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సినిమాలలో ఇది ఒకటి. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే కోర్టు నిన్న సినిమా విడుదలను నిలుపుదల చేస్తూ వాయిదా వేసింది.
'కా ది ఫారెస్ట్' అనేది శలోమ్ స్టూడియోస్- శశికళ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. అయితే ఈ సినిమా విడుదలపై నిషేధం విధించాలంటూ ఎయిట్ ఎంటర్ టైన్ మెంట్ కంపెనీ యజమాని జయకుమార్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో విడుదలకు సంబంధించి న్యాయపరమైన చిక్కుల్లో పడింది. చిత్ర నిర్మాత తీసుకున్న అప్పు విషయంలో స్టూడియోల మధ్య వివాదం జరిగినట్లు తెలుస్తోంది.
షాలోమ్ స్టూడియోస్‌కు చెందిన జాన్ మాక్స్ ఎయిట్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ నుంచి 20 లక్షల రుణం తీసుకున్నారని, 90 రోజుల్లో వడ్డీతో సహా తిరిగి ఇస్తానని హామీ ఇచ్చారని పిటిషన్లో పేర్కొన్నారు. అప్పు చెల్లించకుండా సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించడంతో జయకుమార్ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ సినిమా పూర్తి కాపీరైట్లను కూడా కోరుతున్నారు. ఈరోజు (మార్చి 29) సినిమా విడుదలపై మధ్యంతర నిషేధం విధిస్తూ మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ పిటిషన్‌పై స్పందించాలని నిర్మాతను ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 12కి న్యాయమూర్తి వాయిదా వేశారు. ఏప్రిల్ 12వ తేదీన 'కా ది ఫారెస్ట్' విడుదల కానుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆండ్రియా జెర్మియా - సలీం గౌస్ ప్రధాన పాత్రలు పోషించారు. సుందర్ సి బాబు సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అరివళగన్ సినిమాటోగ్రఫీ, ఎలిసా ఎడిటింగ్.