'కల్కి' ఆల్‌ ఇండియా రికార్డ్‌ ల బ్రేక్‌ షురూ

రెండేళ్ల ఎదురుచూపులకు తెర పడుతుంది. ఈనెల 27న విడుదల కాబోతున్న కల్కి సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్‌ మొదలు అయ్యింది

Update: 2024-06-21 07:05 GMT

ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' సినిమా కోసం ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్స్ కూడా కల్కి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

రెండేళ్ల ఎదురుచూపులకు తెర పడుతుంది. ఈనెల 27న విడుదల కాబోతున్న కల్కి సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్‌ మొదలు అయ్యింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కల్కి సినిమా అమెరికాలో ప్రీ సేల్ ద్వారా ఏకంగా 2 మిలియన్ డాలర్లను రాబట్టిందట.

సినిమా విడుదల అవ్వక ముందే అడ్వాన్స్ బుకింగ్‌ ద్వారా ఓవర్సీస్ లో 15 మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు ఉన్న బజ్ తో పాటు, హాలీవుడ్‌ రేంజ్‌ సినిమా అవ్వడం వల్ల ఇతర భాషల్లో కూడా సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఉత్తర అమెరికాలో 210 ఐమాక్స్ షో లు ఇప్పటికే షెడ్యూల్‌ చేయబడ్డాయి. విడుదలకు ఇంకా సమయం ఉంది కనుక ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలో కూడా అడ్వాన్స్ బుకింగ్‌ తో రికార్డ్‌ లు బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కు దక్కని భారీ రిలీజ్ అమెరికాలో కల్కి కి దక్కడం ఖాయం అంటూ అక్కడి బయ్యర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్ తో హాలీవుడ్‌ రేంజ్ టెక్నాలజీ మరియు విజువల్స్‌ తో కల్కి రూపొందింది. కనుక రూ.2500 కోట్ల వసూళ్ల టార్గెట్‌ తో విడుదల అవ్వబోతుంది. మరి అంత సాధ్యం అవ్వాలంటే ఓవర్సీస్‌ లో అత్యంధికంగా వసూళ్లు నమోదు చేయాల్సి ఉంటుంది.

Tags:    

Similar News