.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

కల్కి హిందీ వెర్షన్.. అంచనాలకు మించే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో తెలిసిందే

Update: 2024-06-29 11:51 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఆ సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకుని దూసుకుపోతోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్ తదితరులు నటించిన కల్కి మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. రెండు రోజులకే.. రూ.300 కోట్ల మార్కుకు చేరువలోకి వచ్చేసింది.

ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా రెండు రోజులకు గాను రూ.298.5 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ రీసెంట్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాకు నార్త్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరిగాయి. బ్లాక్ బస్టర్ హిట్లు ఆర్ ఆర్ ఆర్, సలార్ రికార్డులను బద్దలు కొట్టింది కల్కి. పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుపుకుంది. దీంతో కల్కి విజృంభణకు బాలీవుడ్ ట్రేడ్ పండితులు కూడా ఒక్కసారిగా షాకయ్యారు.

అయితే ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. బీ టౌన్ లో కల్కి రూ.20 కోట్ల ఓపెనింగ్స్ సాధించింది. రెండు రోజు కూడా అదే రేంజ్ లో వసూళ్లు రాబట్టింది. మొదటి రెండు రోజులు కలిపి రూ.41 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. దీని బట్టి చూస్తే.. కల్కి రెండో రోజు కూడా నార్త్ లో మంచి వసూళ్లు అందుకున్నట్లే. తొలి రోజు కన్నా రెండో రోజు కల్కి సినిమాకు 20 శాతం థియేటర్ల ఆక్యుపెన్సీ తగ్గుతుందని ఊహాగానాలు వినిపించాయి.

కానీ అలా జరగలేదు. కాబట్టి కల్కి ఊహించిన దానికంటే బాగానే ఆడుతోందన్నమాట. ఇక శనివారం మరో రూ.22 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే నేడు భారత్- సౌతాఫ్రికా క్రికెట్ జట్ల మధ్య టీ20 ఫైనల్ మ్యాచ్ ఉంది కనుక వసూళ్లు కాస్త తగ్గే ఛాన్స్ ఉంది. కల్కికి ఆదివారం రూ.30 కోట్లకుపైగా వసూళ్లు రావొచ్చని అంచనాలు ఉన్నాయి. వీకెండ్ ముగిసేసరికి రూ.90 కోట్లకు చేరుకుంటుందని అంచనా.

అయితే బాలీవుడ్ లో కల్కి నాలుగు రోజుల్లో రూ.100 కోట్ల మార్క్ అందుకోకపోయినా.. రూ.90 కోట్లు ఏం తక్కువ కాదు. అలా హిందీలో కల్కి రిమార్కబుల్ లాంగ్ రన్ ను అందుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బాహుబలి తర్వాత ఆల్ టైమ్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ కూడా ఉందనే చెప్పాలి. మరి కల్కి 2898 ఏడీ మూవీ హిందీ ఫుల్ రన్ లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News