కల్కి క్రేజీ ట్వీట్.. ఏం చెప్పాలనుకుంటున్నారో?
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఇటీవలే సలార్ తో వచ్చి గ్రాండ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇప్పటివరకు రూ.650 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ.. ఇంకా థియేటర్లలో రన్ అవుతోంది. ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్లతో ఫ్యాన్స్ థియేటర్లలో పూనకాలతో ఊగిపోయారు. ఇక సలార్ తర్వాత ప్రభాస్ లైనప్ పెద్దగానే ఉంది. కల్కి 2898AD, మారుతీ ప్రాజెక్ట్, స్పిరిట్, సలార్ 2.. ఇలా వరుస సినిమాలను లైన్లో పెట్టేశారు డార్లింగ్.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే రిలీజ్ అయిన స్క్రాచ్-3 వీడియోను చూసి ఈ హాలీవుడ్ సినిమాలకు మించి కల్కి ఉంటుందని ఆశిస్తున్నారు ప్రేక్షకులు. కొన్ని రోజుల క్రితం, బాంబే ఐఐటీలో నాగ్ అశ్విన్.. ఈ సినిమా గురించి పలు విషయాలను పంచుకుని మరింత ఆసక్తి పెంచారు.
తాజాగా కల్కి మూవీ మేకర్స్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. #Kalki2898AD REBEL STAR #Prabhas ట్యాగ్స్ ఇచ్చి ప్రభాస్ GIFను పోస్ట్ చేశారు. అందులో ప్రభాస్.. టైమ్ ట్రావెల్ వాచ్ పెట్టుకుని.. ఫింగర్ ను రౌండ్ గా తిప్పుతున్నట్లు చూపించారు. kalki2898ad.vyjayanthi.com వెబ్ సైట్ లింక్ కూడా యాడ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ వెబ్ సైట్ లింక్ పై క్లిక్ చేస్తుంటే.. పైన రెండు నంబర్స్, కింద ఓ ఫోర్ డిజిట్ నంబర్ కనిపిస్తున్నాయి. అవి టైమ్ లా సెకండ్ మినిట్స్ కు నంబర్లు మారుతున్నాయి. దీంతో ఈ పోస్ట్ అర్ధమేంటో తెలియక ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. అసలేంటి అర్ధం కావడం లేదని, పాయింట్ చెప్పండని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పయేండని, టెన్షన్ పెట్టొద్దని ఫన్నీ రిక్వెస్ట్ లు చేస్తున్నారు.
ఈ పోస్ట్ కు వెరైటీగా నెరేట్ చేశారు ఓ నెటిజన్. ఆ టైమర్ సరిగ్గా 2898 AD ఆగినప్పుడు.. మేకర్స్ కల్కి మూవీ అప్డేట్ ఇస్తారని కామెంట్ సెక్షన్ లో చెప్పారు.. అలా చూస్తే ఇంకో మూడు రోజులు వెయిట్ చేయాలని తెలిపారు. మరో మూడు రోజుల్లో మూవీ రిలీజ్ డేట్ ప్రకటిస్తారని, మే9న ఈ సినిమా రిలీజ్ కానుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
కల్కి మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న వైజయంతీ మూవీస్.. ఎన్నో ఏళ్లుగా గొప్ప గొప్ప సినిమాలను అందించింది. ఆ సంస్థ నుంచి వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి, మహర్షి లాంటి సూపర్ హిట్ సినిమాలు మే 9న రిలీజ్ అయ్యాయి. సమ్మర్, ఆ డేట్ ఈ నిర్మాణ సంస్థకు బాగా కలిసొచ్చింది. దీంతో కల్కి లాంటి ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టును కూడా ఆ డేట్ కే రిలీజ్ చేయాలని వైజయంతీ సంస్థ ప్రయత్నిస్తుందని సమాచారం. మరేం జరుగుతుందో చూడాలి.