కల్కి.. మళ్ళీ ఇదెక్కడి ట్విస్ట్?
జూన్ 27న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఏకంగా 22 భాషలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.
శ్రీకృష్ణుడి 10వ అవతారం కల్కి. శంబాల నగరం నుంచి కల్కి ఈ ప్రపంచంలోకి వచ్చి అసుర గుణాలతో విధ్వంసం చేసే వారిని అంతం చేస్తాడని కల్కి పురాణంలో, భాగవతం కథలలో చెప్పబడింది. ఇక కల్కి అవతారం నేపథ్యంలో నాగ్ అశ్విన్ కల్కి 2898ఏడీ మూవీ చేశారు. ఇండియన్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ చిత్రంగా ఈ మూవీ ఉండబోతోంది. భారీ బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
జూన్ 27న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఏకంగా 22 భాషలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో మెయిన్ లీడ్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ పాత్రలో కనిపించబోతున్నారు. కమల్ హాసన్ ప్రతినాయకుడిగా నటించారు. దీపికా పదుకొనే కల్కికి జన్మనివ్వబోయే తల్లి పాత్రలో నటించింది.
మూవీలో ప్రభాస్ చేస్తోన్న పాత్ర పేరు భైరవ. నిజానికి ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీమహావిష్ణువు 10వ అవతారం అయిన కల్కి పాత్రలో కనిపిస్తాడనే ప్రచారం నడిచింది. అయితే కల్కి పుట్టుక ఇంకా జరగలేదని ఈ మూవీ ట్రైలర్ లో చూపించారు. కల్కికి సుమతిగా నటించిన దీపికా పదుకునే జన్మనివ్వబోతోందని ట్రైలర్ లో స్పష్టంగా చూపించారు. డబ్బు కోసం ఆమెని పట్టుకొని విలన్స్ కి అప్పగించే వ్యక్తిగా ప్రభాస్ కనిపిస్తున్నాడు.
దీనిని బట్టి ప్రభాస్ మూవీలో కల్కి పాత్రలో కనిపించడం లేదని క్లారిటీగా తెలుస్తోంది. కల్కి 2898ఏడీ మూవీ కల్కి పుట్టుకతో ఎండ్ అవుతుందని టాక్. కల్కి సెకండ్ పార్ట్ లో కల్కి క్యారెక్టర్ ని పూర్తి స్థాయిలో రిప్రజెంట్ చేస్తారు. అయితే ఈ చిత్రంలో మాత్రం ప్రభాస్ కల్కిగా కనిపించడం లేదని తెలుస్తోంది. అయితే ప్రభాస్ కల్కి సిరీస్ లో భైరవ పాత్రతో పాటు కల్కి రోల్ లో కూడా కనిపిస్తాడనే మాట కూడా వినిపిస్తోంది.
కల్కి పార్ట్ 1లో మాత్రం కల్కి పాత్ర ఉండదని ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది. భైరవ, అశ్వద్ధామ పాత్రల మధ్యనే కథ మొత్తం నడుస్తుందని టాక్. ప్రభాస్ చేస్తోన్న భైరవ క్యారెక్టర్ ని మాత్రం మాత్రం ఈ చిత్రంలో నెగిటివ్ యాంగిల్ లోనే ఎలివేట్ చేశారు. మూవీ క్లైమాక్స్ లో అతని క్యారెక్టర్ ట్రాన్స్ ఫర్మేషన్ ఏమైనా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక సినిమాలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని లాంటి ప్రముఖ నటులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు.