కల్కి రన్ టైం ఎంత?
సినిమా రన్ టైం ఎంత ఉన్న కూడా ప్రేక్షకులని ఎంత వరకు ఎంగేజ్ చేసింది అనే దానిపై సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది
సినిమా రన్ టైం ఎంత ఉన్న కూడా ప్రేక్షకులని ఎంత వరకు ఎంగేజ్ చేసింది అనే దానిపై సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది. సందీప్ రెడ్డి వంగా యానిమల్ మూవీ మూడు గంటలకి పైగా నిడివి ఉంది. అయిన కూడా ఎక్కడా బోర్ కొట్టదు. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి 900 కోట్లు కలెక్ట్ చేసింది. కొన్ని సినిమాల విషయంలో రన్ టైం రెండు గంటల కంటే తక్కువ ఉన్న కూడా ల్యాగ్ అనిపించింది.
మూవీ రన్ టైం అనేది కూడా సినిమాలని పబ్లిక్ లోకి బాగా తీసుకొని వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 ఏడీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకి వస్తోంది. ఇండియన్ మైథాలజీ బేస్ చేసుకొని ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్, బుజ్జి విత్ భైరవ గ్లింప్స్, అలాగే బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్ కూడా రిలీజ్ అయ్యాయి.
ప్రమోషన్స్ లో భాగంగా వీటిని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. వీటితో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ ఫైనల్ అవుట్ ఫుట్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఏ సినిమా రన్ టైంపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ నడుస్తోంది. సినిమాలో అమితాబచ్చన్, కమల్ హాసన్ లాంటి స్టార్ యాక్టర్స్ ఉన్నారు. అలాగే కథ నిడివి కూడా ఎక్కువగానే ఉండొచ్చనే మాట వినిపిస్తోంది. మార్వెల్ సిరీస్ తరహాలో ఈ కల్కి ఫ్రాంచైజ్ ఉండే ఛాన్స్ ఉందంట.
దీనిని బట్టి మూవీ రన్ టైం ఎక్కువగానే ఉంటుందనే ప్రచారం నడుస్తోంది. ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమా ఫైనల్ కట్ 2:51 గంటల నిడివి వచ్చిందంట. అంటే సుమారు 3 గంటల పాటు ప్రేక్షకులని కల్కి మూవీ థియేటర్స్ లో కూర్చోబెట్టబోతోంది. కంప్లీట్ న్యూస్ వరల్డ్ ని ఈ చిత్రం కోసం నాగ్ అశ్విన్ టీం సృష్టించింది. అందుకే కచ్చితంగా ఆడియన్స్ కల్కి ప్రపంచానికి కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ సినిమా సక్సెస్ బట్టి నెక్స్ట్ నాగ్ అశ్విన్ సినిమాటిక్ యూనివర్స్ లో కల్కి తరహా కథలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉందని ఇప్పటికే లీకులు వస్తున్నాయి. కల్కి మూవీ అందరి అంచనాలని రీచ్ అవుతుందని ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి. మరి ఈ ఏడాదిలో ఇండియన్ ఫస్ట్ 1000 కోట్ల చిత్రంగా కల్కి మూవీ నిలుస్తుందా లేదా అనేది తెలియాలంటే రిలీజ్ వరకు ఎదురుచూడాల్సిందే.