కల్కి 2898 AD.. సౌండ్ మరింత పెరిగేలా..

ఇదిలా ఉంటే ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది

Update: 2024-06-14 13:31 GMT

డార్లింగ్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కల్కి 2898 ఏడీ. ఈ మూవీ జూన్ 27న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. 600+ కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ నిర్మించింది. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా కల్కి చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకొని వస్తున్నారు. మార్వెల్ సిరీస్ తరహాలోనే కల్కి ఫ్రాంచైజ్ లో మొదటి సినిమాగా ఈ చిత్రం రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ లో కల్కి మూవీ విజువల్ ఫీస్ట్ గా ఉండబోతోందనే మాట సినీ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. నాగ్ అశ్విన్ ఓ కొత్త ప్రపంచాన్ని కల్కి 2898 ఏడీ కోసం క్రియేట్ చేసాడని ట్రైలర్ తో స్పష్టం అయ్యింది. ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రంగా ఈ మూవీ ఉండబోతోందని చిత్ర యూనిట్ తెలిపింది.

దీనికి కారణం ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని లాంటి టాప్ స్టార్స్ నటించడమే. హాలీవుడ్ లో కూడా కల్కి మూవీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం యాక్టివ్ గా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రం యూనిట్ ప్రకటించింది.

సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఫస్ట్ సింగిల్ ఎనౌన్స్ పోస్టర్ లో రెండు హ్యాండ్స్ చూపించారు. దీనిని బట్టి ఇది మూవీ కంటెంట్ ని రిప్రజెంట్ చేసే సాంగ్ అవ్వొచ్చనే మాట వినిపిస్తోంది. ఈ సాంగ్ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. సాంగ్స్ కూడా క్లిక్ అయితే మూవీకి మరింత హైప్ రావడం గ్యారెంటీ అనే ప్రచారం నడుస్తోంది. త్వరలో ఈ సినిమాకి సంబంధించి యాక్టర్స్ ఇంటర్వ్యూలు కూడా ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

టీజర్ ట్రైలర్ పై అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక సాంగ్స్ కూడా సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మూవీని వీలైనంత స్ట్రాంగ్ గా పబ్లిక్ లోకి తీసుకొని వెళ్ళడానికి చిత్ర యూనిట్ యాక్టివ్ గా ప్రమోషన్స్ చేస్తోంది. తెలుగు, హిందీ భాషలలో కల్కి 2898ఏడీ సినిమా పట్ల ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ సాలిడ్ గా జరుగుతున్నాయని తెలుస్తోంది.

Tags:    

Similar News