అసలైన ఘట్టంలో బిజీబిజీగా కల్కి టీమ్
ఇక నెక్స్ట్ వీక్ లో ఒక కీలకమైన షెడ్యూల్ స్టార్ట్ కాబోతోంది. అందులో ప్రభాస్ తో పాటు సినిమాలో మెయిన్ క్యాస్ట్ అందరూ కూడా పాల్గొనబోతున్నారు.
ప్రభాస్ నుంచి రాబోతున్న తదుపరి సినిమా కల్కి 2898AD. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో కానీ ఇటీవల వచ్చిన అప్డేట్స్ మాత్రం పెద్దగా పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేయడం లేదు. సినిమా కోసం నిర్మాణ సంస్థ వైజయంతి ప్రొడక్షన్స్ గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువ స్థాయిలో కోసం ఖర్చు పెడుతుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ పై ప్రేక్షకుల్లో నమ్మకం అయితే గట్టిగానే ఉంది.
అతని మేకింగ్ విధానం వెండి తెరపై తప్పకుండా క్లిక్ అవుతుంది అనే విధంగా కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. కానీ సినిమా ఫస్ట్ టీజర్ మాత్రం అనుకున్నంత స్థాయిలో హై లెవెల్లో అయితే హైప్ క్రియేట్ చేయలేదు. ఇక యూనిట్ ఇలాంటి పొరపాటు జరగకుండా తదుపరి అప్డేట్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి అని ప్రణాళికలు రచిస్తోంది.
ఇక కల్కి సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ పై ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ మే 9వ తేదీన విడుదల చేయాలి అని వైజయంతి మూవీస్ నిర్ణయం తీసుకుంది. ఈ డేట్ ఆ సంస్థకు చాలా సెంటిమెంట్. గతంలో వచ్చిన మహానటి జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సాలీడ్ లాభాలను అందించాయి. అందుకే నిర్మాత అశ్విని దత్ షూటింగ్లో ఎలాంటి ఆలస్యం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇక నెక్స్ట్ వీక్ లో ఒక కీలకమైన షెడ్యూల్ స్టార్ట్ కాబోతోంది. అందులో ప్రభాస్ తో పాటు సినిమాలో మెయిన్ క్యాస్ట్ అందరూ కూడా పాల్గొనబోతున్నారు. కమల్ హాసన్ తోపాటు అమితాబచ్చన్ అలాగే దీపిక పదుకొనే కూడా ఒక పది రోజులపాటు కొనసాగే ఎపిసోడ్లో హార్డ్ వర్క్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ షెడ్యూల్ కూడా ల్ సినిమాకు చాలా కీలకంగా ఉండబోతుందట.
ప్రీ క్లయిమాక్స్ లో వచ్చే సన్నివేశాలు షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముందుగానే వర్క్ షాప్ లో కాస్త ట్రైనింగ్ ఇచ్చిన దర్శకుడు ఇప్పుడు టిమ్ మొత్తాన్ని డైరెక్ట్ గా సెట్స్ పైకి తీసుకు వెళ్తున్నాడు. ఈ షెడ్యూల్ ఆలస్యమైతే మళ్లీ రాబోయే రోజుల్లో అనుకున్నా సమయానికి సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉండదట. అందుకే ఎలాంటి పొరపాటు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా కొనసాగిస్తున్నట్లు సమాచారం.