కల్కి.. మళ్లీ అవే తప్పులా?
ఈ మూవీలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ స్పెషల్ పాత్రలో కనిపించనుంది.
ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులంతా ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న మూవీ కల్కి 2898 ఏడీ. ఇంటర్నేషనల్ లెవెల్ లో సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రంగా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్టు దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ స్పెషల్ పాత్రలో కనిపించనుంది.
అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తో పాటు అనేక మంది ప్రముఖులు.. కల్కి మూవీలో నటిస్తున్నారు. హాలీవుడ్ చిత్రాల తరహాలో ఫ్యూచరిస్టిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. వేసవి కానుకగా మే9వ తేదీన విడుదల కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం.. మే 13వ తేదీ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో ఈ మూవీ రిలీజ్ వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి.
కానీ ఇప్పటి వరకు కల్కి సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ మే 9నే కల్కి రిలీజ్ అవుతుందని అనుకుంటే.. 35 రోజులు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి. మేకర్స్ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. కనీసం పాటలు, టీజర్ కూడా రిలీజ్ చేయలేదు. అలా అని కొత్త రిలీజ్ డేట్ కూడా ప్రకటించలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
మే 9న రిలీజ్ చేయాలనుకుంటే ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని అంటున్నారు. పాన్ ఇండియా మూవీ కనుక భారీ స్థాయిలో సినిమాను ప్రమోట్ చేయాల్సి ఉందని, సమయం మించిపోతుందని చెబుతున్నారు. కనీసం కొత్త రిలీజ్ డేట్ అయినా ప్రకటించాలని కోరుతున్నారు. గత ఏడాది డిసెంబర్ లో వచ్చిన సలార్ మూవీ విషయంలో జరిగిన తప్పులను రిపీట్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు.
అప్పట్లో సలార్ విడుదల తేదీని సరైన టైమ్ కు ప్రకటించకపోవడం వల్ల ఆ సినిమాకు రూ.100-150 కోట్ల నష్టం వచ్చిందని వార్తలు వచ్చాయి. సలార్ ఆలస్యం అవ్వడం వల్ల పలు చిత్రాలు కూడా నష్టపోయాయి. దీంతో ఆ తప్పులు కల్కి మేకర్స్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సరైన రిలీజ్ డేట్ ను ఎంచుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ చిత్రం విడుదల విషయంలో మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.