కల్కి.. ఇది కూడా నిజమైతే అడ్డే లేదు..
ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీమహావిష్ణు 10వ అవతారం అయిన కల్కి పాత్రలో కనిపిస్తున్నాడు.
టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898ఏడీ. ఇండియన్ మైథలాజికల్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు. 600 కోట్ల బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని స్వప్న దత్, ప్రియాంక దత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీమహావిష్ణు 10వ అవతారం అయిన కల్కి పాత్రలో కనిపిస్తున్నాడు. అలాగే భైరవ అనే మరో రోల్ లో కూడా నటించాడు.
బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ ఈ చిత్రంలో అశ్వద్ధామ పాత్ర చేశారు. కమల్ హాసన్ ప్రతినాయకుడిగా కనిపించబోతుండగా దీపికా పదుకునే, దిశా పటాని లాంటి స్టార్ హీరోయిన్ ప్రభాస్ కి జోడీగా నటించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా వుంది. కచ్చితంగా మూవీ వండర్స్ క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.
జూన్ 27న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఏకంగా 22 భాషలలో ఈ చిత్రం రిలీజ్ అవుతుందని ఇప్పటికే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. అయితే స్ట్రైట్ థియేటర్స్ రిలీజ్ ఎన్ని భాషలలో ఉంటుందనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇప్పటికే బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ భాగం అయ్యారు. అయితే ఇప్పుడు మరో ఇంటరెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది.
కల్కి 2898ఏడీలో గెస్ట్ రోల్స్ లో టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలా మంది నటిస్తున్నారంట. నాగ్ అశ్విన్ మహానటి సినిమా కోసం టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ ని, డైరెక్టర్స్ ని కీలక పాత్రల కోసం ఉపయోగించుకున్నాడు. అలాగే కల్కి 2898ఏడీ సినిమాలో కూడా కీలక పాత్రల కోసం నేచురల్ స్టార్ నాని, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లాంటి స్టార్స్ ని దించుతున్నారంట.
వీరితో పాటు మరికొంత మంది స్టార్ యాక్టర్స్ కూడా మూవీలో గెస్ట్ రోల్స్ లో కనిపించబోతున్నారంట. వారు ఎవరనేది డైరెక్ట్ గా స్క్రీన్ పైనే రివీల్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు టాక్. వైజయంతీ మూవీస్ అంటే టాలీవుడ్ లో హీరోలు అందరికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అలాగే నాగ్ అశ్విన్ టేకింగ్ టాలెంట్ గురించి చాలా మందికి తెలుసు. ఈ కారణంగానే అతను అడిగిన వెంటనే చేయడానికి ఒకే చెప్పినట్లు ప్రచారం నడుస్తోంది. ఇది నిజమైతే గనక సినిమా స్టార్ క్యాస్ట్ తోనే హై రేంజ్ లో బజ్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది.