కల్కి ఓవర్సీస్ రైట్స్.. ఆ రేంజ్ లోనా?

అలాగే కమర్షియల్ మూవీగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిప్రజెంట్ చేస్తున్నారు. ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో హైయెస్ట్ బడ్జెట్ తో కల్కి తెరకెక్కుతోంది.

Update: 2024-02-08 07:00 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 ఏడీ. ఈ చిత్రంలో కమల్ హాసన్ ప్రతినాయకుడిగా నటిస్తూ ఉండగా, అమితాబచ్చన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే దీపికా పదుకునే హీరోయిన్ గా చేస్తోంది. దిశా పటాని ఓ కీలక పాత్రలో మెరవబోతోంది. భారీ క్యాస్టింగ్ తో ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ రెండు భాగాలుగా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.

మే 9న కల్కి 2898 ఏడీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 22 భాషలలో ఏకకాలంలో రిలీజ్ కాబోతోంది. ఇంగ్లీష్ వెర్షన్ కూడా అప్పుడే రానుంది. ఇండియా నుంచి ఇంగ్లీష్ మూవీస్ చాలా వచ్చాయి. అయితే మొదటి సారి హాలీవుడ్ స్టాండర్డ్స్ లో కల్కి మూవీ రాబోతోంది. అలాగే కమర్షియల్ మూవీగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిప్రజెంట్ చేస్తున్నారు. ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో హైయెస్ట్ బడ్జెట్ తో కల్కి తెరకెక్కుతోంది.

ఇప్పటికే ఈ సినిమాపై బిజినెస్ ని వైజయంతీ మూవీస్ స్టార్ట్ చేసిందంట. ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల కోసం అశ్వినీదత్ ఏకంగా వంద కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డిస్టిబ్యూటర్స్ 70 నుంచి 80 కోట్ల మధ్యన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంట. అయితే వంద కోట్లు ఇస్తేనే హక్కులు ఇస్తానని నిర్మాత క్లారిటీగా చెప్పేసినట్లు టాక్. ఎవరూ అనుకున్న రేటు కోట్ చేయకపోతే సొంతంగా రిలీజ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారంట.

ఇదే స్థాయిలో ఇండియా మొత్తం మీద బిజినెస్ లెక్కలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ కంటే ఎక్కువగా ఈ మూవీ కోసం నిర్మాత డిమాండ్ చేస్తున్నారంట. సినిమా క్వాలిటీ, కంటెంట్ స్టాండర్డ్స్ ని దృష్టిలో ఉంచుకొని ఈ స్థాయిలో అడుగుతున్నట్లు తెలుస్తోంది. డిమాండ్ చేసే స్థాయిలో డిస్టిబ్యూటర్స్ నుంచి రాకపోతే అన్ని ప్రాంతాలలో సొంతంగానే కల్కి చిత్రాన్ని రిలీజ్ చేసుకోవాలని నిర్మాత భావిస్తున్నారంట.

సినిమా అవుట్ ఫుట్ అద్భుతంగా వచ్చిందని ఆ నమ్మకంతోనే ఈ స్థాయిలో డేరింగ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఒక వేళ నిర్మాతలు అడిగినంత డిస్టిబ్యూటర్స్ ఇవ్వడానికి ముందుకొస్తే మాత్రం ఇండియన్ సిల్వర్ స్క్రీన్ అత్యధిక బిజినెస్ జరిగిన మూవీగా కల్కి 2898 ఏడీ మారే అవకాశం ఉంటుంది.


Tags:    

Similar News