కల్కి.. డోస్ పెంచాల్సిందే..
ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించింది.
ప్రభాస్ నటించిన కల్కి 2898AD సినిమా మరికొన్ని రోజుల్లో గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. కరెక్ట్ గా ఒక వారం గడిస్తే బాక్సాఫీస్ వద్ద అసలైన సందడి కనిపిస్తుంది. ఇండియాలోనే ఇప్పటివరకు ఎవరు చూపించని కథను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరపైకి తీసుకురాబోతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించింది.
తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని వారు ఎంతగానో నమ్మకమైతే పెట్టుకున్నారు. ముఖ్యంగా నిర్మాత అశ్విని దత్ ఈ సినిమా విడుదలకు ముందు చిన్న సినిమా అని విడుదల తర్వాత మాత్రం చాలా పెద్ద సినిమా అవుతుంది అని చెప్పడం చాలా ఆసక్తిగా అనిపించింది. అయితే ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ ఎలా ఆలోచిస్తున్నారో తెలియదు కానీ మరి ఇంత స్థాయిలో ప్రమోషన్స్ చేస్తే కరెక్ట్ కాదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటివరకు బుజ్జి భైరవ అనే సౌండ్ తప్పించి జనాల్లో పెద్దగా కల్కి గురించే చర్చలు అయితే కనిపించడం లేదు. సినిమాకు సంబంధించిన ఒక పంజాబీ సాంగ్ కూడా విడుదల చేశారు. అయితే అది వచ్చిన వెంటనే బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఫ్యాన్స్ ఇంకా ఏదో కావాలి అని ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ కూడా ఎట్రాక్ట్ చేసింది. అయితే ఎన్ని వీడియోలు సాంగ్స్ విడుదల చేసిన కూడా సినిమాకు సంబంధించిన మేకర్స్ తో పాటు ఆర్టిస్ట్ లు అందరూ కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటే ఆ హడావిడి వేరేలా ఉంటుంది. ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు సంబంధించిన అనేక విషయాల గురించి చర్చిస్తే సినిమాను చూడాలి అనే ఆసక్తి మరింత ఎక్కువగా ఉంటుంది.
అయితే అంచనాల స్థాయిని ఒక లిమిట్ లో ఉంచాలని అనుకున్నారో ఏమో కానీ మరీ ఇంత తక్కువగా అంటే ఫ్యాన్స్ సంతృప్తి చెందడం లేదు. పాన్ వరల్డ్ ప్రాజెక్టు అనే మాటే కానీ అసలు ఆ రేంజ్ లో అయితే ప్రమోషన్స్ సౌండ్ వినిపించడం లేదు. ముఖ్యంగా నార్త్ లో ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టింది లేదు. అక్కడ ఎంతో కొంత ప్రత్యేకంగా ఈవెంట్స్ నిర్వహిస్తేనే మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది.
తమిళం మలయాళం ఇండస్ట్రీలో కూడా స్పెషల్ ప్రెస్ మీట్ నిర్వహించి సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ ఇప్పుడే చేయాలి. కానీ కల్కి టీం మాత్రం సినిమా విడుదలకు ఇంకా తొమ్మిది రోజుల సమయమే ఉన్నప్పటికీ చాలా నెమ్మదిగా వెళుతుంది. అసలు కల్కి రిలీజ్ అవుతున్న హడావిడి మిగతా భాషల్లో పెద్దగా కనిపించడం లేదు. ఈ తరహాలో వెళితే బాక్సాఫీస్ టార్గెట్ ను అందుకోవడం కష్టమవుతుంది..
ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమా జనాలకు చాలా దగ్గరగా తీసుకు వెళ్ళాలి. ఫ్యాన్స్ అయితే ప్రమోషన్స్ డోస్ పెంచాల్సిందే అంటున్నారు. మరి చిత్ర యూనిట్ సభ్యులు రాబోయే రోజుల్లో సినిమాలో నటించిన స్టార్స్ తో ఏదైనా స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తారో లేదో చూడాలి. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొనే కమల్ హాసన్ వంటి స్టార్స్ ఉన్నారు. వారితో కూడా ఏదో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తే సినిమాకు అన్ని భాషల నుంచి మంచి హైప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది