కల్కి 2898AD ట్రైలర్: విజువల్స్ తోనే స్టన్ అయ్యేలా..

ఈ భూమి మీద మొదటి నగరమైన కాశీ, చివరి నగరంగా కూడా అదే అన్నట్లు రాజేంద్రప్రసాద్ డైలాగ్స్ తో ట్రైలర్ మొదలైంది.

Update: 2024-06-10 14:36 GMT

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ "కల్కి 2898AD"పై ప్రేక్షకుల అంచనాలు భారీగా ఉన్నాయి. హిందు మైథాలీకి లింక్ చేస్తూ సరికొత్త అడ్వెంచరస్ గా ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆ అంచనాలను మరింతగా పెంచింది. ట్రైలర్ విడుదలతో సినిమా గురించి మరింత స్పష్టత వస్తోంది.

ఈ భూమి మీద మొదటి నగరమైన కాశీ, చివరి నగరంగా కూడా అదే అన్నట్లు రాజేంద్రప్రసాద్ డైలాగ్స్ తో ట్రైలర్ మొదలైంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో కనిపిస్తుండగా, దీపికా పదుకొనె పద్మావతి పాత్రలో నటిస్తున్నారు. ట్రైలర్‌లో కనిపించినట్లుగా, గర్భవతిగా ఉన్న పద్మావతిని రక్షించాలనే క్రమంలో అశ్వత్థామ, భైరవ మధ్య ఉద్వేగపూరిత క్లాష్ ఏర్పడడం వంటి అంశాలు ప్రధానంగా నిలుస్తాయి.

ఇక బుజ్జితో భైరవ విన్యాసాలు, కామెడీ సీన్స్ కూడా మరీంత హైలెట్ అవుతున్నాయి. యాక్షన్ సీన్స్ లో విజువల్స్ మాములుగా లేవు, ఈ సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని ట్రైలర్ చూపిస్తోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రతీ ఫ్రేమ్‌ను అత్యంత కష్టపడి, శ్రద్ధతో తీర్చిదిద్దినట్లు స్పష్టంగా తెలుస్తోంది. వైజయంతి మూవీస్ ఈ ప్రాజెక్ట్‌పై దాదాపు 600 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వెనుక కారణం ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

సినిమాలో రాజేంద్రప్రసాద్ ప్రత్యేక పాత్రలో కనిపించనుండగా, కమల్ హాసన్ విభిన్నమైన మేకోవర్‌తో అలరించనున్నారు. "బయపడకు, మరో ప్రపంచం వస్తుంది" అనే డైలాగ్ ట్రైలర్‌లో హైలైట్ అయ్యింది. ట్రైలర్‌లో చూపిన విజువల్స్, సన్నివేశాలు ప్రేక్షకులలో ఉత్కంఠను పెంచుతున్నాయి. ఈ సినిమా జూన్ 27న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. "కల్కి 2898AD" సినిమా టెక్నికల్ గా, కంటెంట్ పరంగా అత్యంత ప్రాముఖ్యమైన ప్రాజెక్ట్ అవుతుంది. ప్రభాస్ నటన, నాగ్ అశ్విన్ దర్శకత్వం, భారీ బడ్జెట్, అద్భుతమైన విజువల్స్ కలగలిసిన ఈ సినిమా భారీ హిట్ అవుతుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. "కల్కి 2898AD" ట్రైలర్ చూస్తేనే సినిమాపై ఉన్న అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో స్పష్టంగా తెలుస్తోంది. ఇక సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం పక్కా అని చెప్పవచ్చు.


Full View


Tags:    

Similar News