కల్కి ఆ స్టిల్ వెనక ఉన్నది ఎవరంటే..?

ఆ పోస్టర్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. కల్కి మెయిన్ హైలెట్స్ లో క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు.

Update: 2024-07-10 09:55 GMT

సినిమా మీద ఎన్ని అంచనాలు ఉంటే డైరెక్టర్ మీద అంత ప్రెజర్ ఉంటుంది. ముఖ్యంగా సినిమా కోసం తీసుకున్న కాస్టింగ్ కి న్యాయం చేయాల్సి ఉంటుంది. కల్కి సినిమా కోసం ప్రభాస్ ఒక్క కటౌట్ మాత్రమే కాదు బిగ్ బీ అమితాబ్, లోకనాయకుడు కమల్ హాసన్ లాంటి మహా నటులను ఎంపిక చేశాడు నాగ్ అశ్విన్. సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడు వీళ్లను డైరెక్టర్ ఎలా వాడుకుంటాడా అని డౌట్ ఉండేది. అమితాబ్ పాత్రకు సంబంధించిన పోస్టర్స్ అన్ని రిలీజ్ ముందే ఒక క్లారిటీ వచ్చింది.

 

ఐతే సినిమా రిలీజ్ వరకు సస్పెన్స్ ఉంచింది మాత్రం కమల్ హాసన్ పాత్రనే. సినిమాలో సుప్రీం యాస్కిన్ పాత్రలో కమల్ అదరగొట్టాడు. ఆయనకు ఇలాంటి పాత్రలు వెన్నతో పెట్టిన విద్య. కల్కి సినిమాలో కమల్ రోల్ లెంగ్త్ విషయంలో ఫ్యాన్స్ కాస్త అసంతృపిగా ఉన్నా సినిమాకు ఎంత అవసరమో అంతా ఇచ్చినట్టు అర్ధమవుతుంది. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా ఈ సినిమాలో క్లైమాక్స్ లో కమల్ ఇచ్చిన ఒక సలహా గురించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ వెల్లడించారు.

కల్కి క్లైమాక్స్ లో కమల్ అదే సుప్రీం యాస్కిన్ విల్లు పట్టుకునే ఒక ఫోజ్ ఉంటుంది. అది కమల్ సార్ ఇలా చేద్దామని అన్నారట. ఆ పోస్టర్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. కల్కి మెయిన్ హైలెట్స్ లో క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. తనకున్న 200 పైగా సినిమాల అనుభవం తన ప్రతి సినిమాకు ఉపయోగిస్తారు కమల్ హాసన్. అందుకే సుప్రీం యాస్కిన్ క్యారెక్టర్ కి కూడా తన సైడ్ నుంచి కొన్ని ఇన్ పుట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఊరికే అమితాబ్, కమల్ హాసన్ లాంటి స్టార్స్ ని తీసుకోవడం కాదు వారి ఇమేజ్ కు తగిన పాత్రల్లో చూపిస్తే ఆ స్టార్ ఫ్యాన్స్ కూడా సర్ ప్రైజ్ అవుతారు. అందుకే కల్కి లో ప్రభాస్, అమితాబ్, కమల్ పాత్రలు అంతగా క్లిక్ అయ్యాయి. కల్కి 1 లో సుప్రీం యాస్కిన్ పాత్ర అలా ముగించిన నాగ్ అశ్విన్ పార్ట్ 2 లో మాత్రం అదే మెయిన్ హైలెట్ అయ్యేలా చేస్తాడని టాక్. ఏది ఏమైనా కల్కి తో ఆడియన్స్ కు ఒక అద్భుతమైన విజువల్ ఎక్స్ పీరియన్స్ అందించడంలో నాగ్ అశ్విన్ సక్సెస్ అయ్యాడు. కల్కి సినిమా మరోసారి ప్రభాస్ కెరీర్ లో 1000 కోట్ల సినిమాగా రికార్డులను సృష్టిస్తుంది.

Tags:    

Similar News