ఇళ‌య‌రాజా బ‌యోపిక్‌కి క‌మ‌ల్ హాస‌న్ స్క్రీన్ ప్లే

సాంకేతిక బృందంలో డిఓపిగా నీరవ్ షా ..ఆర్ట్ డైరెక్టర్‌గా ముత్తురాజ్ ఉన్నారు. మోస్ట్ అవైటెడ్ బ‌యోపిక్ షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభమవుతుంది

Update: 2024-03-21 10:19 GMT

స్వ‌ర‌మాంత్రికుడు, ఇసైజ్ఞాని ఇళయరాజా బయోపిక్ నిన్న అధికారికంగా లాంచ్ అయింది. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన సంగీతకారులలో ఆయన ఒకరు. 'ఇళయరాజా' పేరుతో తెరకెక్కుతున్న మాస్ట్రో బయోపిక్‌లో ధనుష్ టైటిల్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని నిన్న ఇళయరాజా, కమల్‌హాసన్‌లు ఆవిష్కరించారు.

ఇంత‌లోనే ఇళయరాజా బయోపిక్‌కి కమల్‌హాసన్‌ స్క్రీన్‌ప్లే రాయనున్నారనే ఆస‌క్తికర వార్తలు వెలువడ్డాయి. నిన్న‌టి కార్యక్రమంలో ఉలగనాయగన్ అధికారికంగా ప్రకటించార‌ని సోష‌ల్ మీడియాల్లో ప్ర‌చారం సాగుతోంది. అయితే దీనిపై మ‌రింత స్ప‌ష్ఠంగా క‌మ‌ల్ మాట్లాడ‌తారేమో వేచి చూడాలి. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం క‌నెక్ట్ మీడియా- PK ప్రైమ్ ప్రొడక్షన్ , మెర్క్యురీ గ్రూప్‌ల సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమిళ చిత్రసీమలో అత్యంత క్రేజ్ ఉన్న అతిపెద్ద చిత్రాల్లో ఇదొకటి. త‌మిళం-తెలుగు-హిందీ-మ‌ల‌యాళం- క‌న్న‌డ‌లో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది.

సాంకేతిక బృందంలో డిఓపిగా నీరవ్ షా ..ఆర్ట్ డైరెక్టర్‌గా ముత్తురాజ్ ఉన్నారు. మోస్ట్ అవైటెడ్ బ‌యోపిక్ షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది రిలీజ‌వుతుంది. లాంచింగ్ ఈవెంట్‌లో, ధనుష్ తన ప్రసంగంలో ఇళయరాజా- సూపర్ స్టార్ రజనీకాంత్‌ల బయోపిక్‌లలో నటించాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నానని, వాటిలో ఒకటి సాధ్య‌మ‌వ్వ‌డం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

Tags:    

Similar News