బెడ్ రూమ్ లో జ్ఞానేశ్వరి అందాల దాడి

తెలుగమ్మాయిలు కూడా అందాలు ఆరబోయడంలో తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

Update: 2024-07-04 08:01 GMT

తెలుగమ్మాయిలు కూడా అందాలు ఆరబోయడంలో తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అలా కొన్ని నెలలుగా ఫుల్ గ్లామర్ షో చేస్తూ పాపులారిటీ దక్కించుకుంటోంది వైజాగ్ బ్యూటీ జ్ఞానేశ్వరి కాండ్రేగుల. టీనేజ్ లో ఉన్నప్పుడే మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుసగా షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది. తన యాక్టింగ్ తో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది జ్ఞానేశ్వరి.


దీంతో సినిమాలతోపాటు వెబ్ సిరీసుల్లో అవకాశాలు అందుకుని నటించింది. ఎన్నో చిత్రాలు, వెబ్ సిరీసులతో అలరించింది. ఆ తర్వాత యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపులు షోలో పాల్గొని ఒక్కసారి లైమ్ లైట్ లోకి వచ్చేసింది. షో విన్నర్ గా నిలిచి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఆ షో తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతోంది. మంత్ అఫ్ మధు మూవీ, నాగ చైతన్య ధూత వెబ్ సిరీస్ లో మంచి పాత్రల్లో కనిపించి ఆకట్టుకుంది.

ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోంది జ్ఞానేశ్వరి. అయితే కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో కూడా తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది. తన సినిమాలతో పాటు పర్సనల్ విషయాలు షేర్ చేసుకుని ట్రెండింగ్ లో నిలుస్తోంది. ఎప్పటికప్పుడు నయా పిక్స్ షేర్ చేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటూ ఉంటోంది. తరచూ వెకేషన్స్ కు వెళ్లే ఈ అమ్మడు అక్కడ ఫోటోలు దిగి వెంటనే పోస్ట్ చేస్తూ ఉంటోంది.

తాజాగా బెడ్ రూమ్ లో దిగిన పిక్స్ షేర్ చేసింది అమ్మడు. ఒక్కసారిగా సోషల్ మీడియాలో సెగలు రేపింది. తన అందాలతో హీట్ పుట్టించింది. ఫ్లోరల్ బ్యాక్ లెస్ మినీ డ్రెస్ వేసుకున్న బ్యూటీ.. ఓ రేంజ్ లో పోజులు ఇచ్చింది. వేరే లెవల్ లో ఎక్స్ప్రెషన్స్ తో అదరగొట్టింది. గులాబీ రెక్కలు తింటూ.. బాడీపై వేసుకుంటూ కుర్రాళ్ల మతులు పోగుడుతోంది. అదిరిపోయే బ్యాక్ పోజుతో, ఎద అందాలతో కవ్విస్తోంది బ్యూటీ.

ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న జ్ఞానేశ్వరి కాండ్రేగుల పిక్స్ చూసి అంతా ఫిదా అవుతున్నారు. అమ్మడి పోజులకు, ఎక్స్ప్రెషన్స్ కు ఎవరైనా ఫ్లాట్ అవ్వకుండా ఉంటారా అని అడుగుతున్నారు. బెడ్ రూమ్ ఫోటోషూట్ వేరే లెవల్ లో ఉందని చెబుతున్నారు. చూపులతోనే మత్తెక్కిస్తోందని అంటున్నారు. ఓ రేంజ్ లో లైకులు కొడుతూ వైరల్ చేస్తున్నారు. అందాల జాతర అంటూ కామెంట్ బాక్స్ అంతా నింపేస్తున్నారు.

Tags:    

Similar News

eac