ఆ హీరోయిన్ కోసం నెట్ ప్లిక్స్ రిస్క్ తీసుకుంటుందా?
ఎట్టకేలకు కంగనా రనౌత్ స్వీయా దర్శకత్వంలో తెరకెక్కించిన `ఎమర్జన్సీ` జనవరి 17న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.
ఎట్టకేలకు కంగనా రనౌత్ స్వీయా దర్శకత్వంలో తెరకెక్కించిన `ఎమర్జన్సీ` జనవరి 17న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. రిలీజ్ కి ముందు సినిమాకి వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. కంగన `ఎమర్జన్సీ`తో అద్భుతం ఏదో చేస్తుందనే విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. అంతకు ముందు వివిధ రాజకీయ పార్టీలు అభ్యంతరం చెప్పడం, అటుపై సెన్సార్ చాలా సన్నివేశాలకు కత్తెర వేయడమే కాకుండా... రిలీజ్ విషయం లో కంగన చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది.
కానీ రిలీజ్ తర్వాత తొలి షోతోనే ఎమర్జన్సీ అంత అర్జెన్సీ సినిమా కాదని తేలిపోయింది. సినిమాకి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. ప్రేక్షకులకు ఏమాత్రం రుచించని చిత్రంగా మారిపోయింది. సినిమాలో పాత్రలు, మేకింగ్ ప్రతీది ప్రేక్షుకుడి సహనాన్ని పరీక్షించినట్లే ఉందని రిపోర్ట్ వచ్చింది. 60 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన సినిమా నాలుగు రోజుల్లో 11.35 కోట్లు మాత్రమే రాబట్టింది. ప్రస్తుతం కలెక్షన్లు మరింత డల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో కంగన అభిమానులు మాత్రం ఈ చిత్రాన్ని పునరాగమనంగా భావిస్తే..మరికొంత మంది మాత్రం కంగన కెరీర్ లో ఈ చిత్రాన్ని ఓ విపత్తుగా భావిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలో కూడా రిలీజ్ అవుతుందని సమాచారం. ఇంకా రిలీజ్ తేది ప్రకటించలేదు గానీ నెట్ ప్లిక్స్ మాత్రం ఈ సినిమా కంటెంట్ కి ఫిదా అయింది. అందుకే భారీ మొత్తానికి రైట్స్ దక్కించుకుంది. కానీ థియేట్రికల్ రన్ తర్వాత టాక్ మారడంతో? నెట్ ప్లిక్స్ కి కాస్త టెన్షన్ పట్టుకుంది.
అయితే ఓటీటీ లో ఈ సినిమా అన్ కట్స్ తో రిలీజ్ అవుతుందా? థియేటర్ ప్రింట్ నే రిలీజ్ చేస్తారా? అన్నది చూడాలి. సినిమాలో చాలా సన్నివేశాలకు సెన్సార్ కట్స్ వేసింది. ఓటీటీలో అలాంటి నిబంధనలు లేవు కాబట్టి కట్స్ లేకుండా రిలీజ్ చేసుకోవచ్చు. కానీ ఇది రాజకీయ నేపథ్యంతో కూడిన సినిమా కావడంతో ఓటీటీలో అన్ కట్స్ తో రిలీజ్ అయిన అనంతరం అభ్యంతరాలు వ్యక్తమైతే మాత్రం చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఆ సాహసం నెట్ ప్లిక్స్ చేస్తుందా? లేదా? అన్నది చూడాలి.