చంద్రముఖి 2.. ఈమెకు చాలా అవసరం!
బాలీవుడ్ లో క్వీన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ కంగనా రనౌత్.
బాలీవుడ్ లో క్వీన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ కంగనా రనౌత్. ఈ భామ 2006లో గ్యాంగ్ స్టార్ - ఏ లవ్ స్టోరీ మూవీతో బాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే వరుస సినిమాలు చేస్తూ వచ్చింది. ఒకానొక దశలో స్టార్ హీరోలతో వరుస సినిమాలలో జత కడుతూ వచ్చింది. తెలుగులో ప్రభాస్ కి జోడీగా ఏక్ నిరంజన్ సినిమాలో కూడా కంగనా నటించింది.
2013 నుంచి కంగనా రనౌత్ కెరియర్ ట్రాక్ మారిపోయింది. ఎక్కువగా ఫీమేల్ సెంట్రిక్ కథలు చేస్తూ వరుస విజయాలు అందుకుంది. ఓ విధంగా బాలీవుడ్ స్టార్ హీరోలకి పోటీ ఇచ్చే రేంజ్ కి ఆమె ఇమేజ్ ఎదిగింది. అలాగే స్టార్స్ హీరోలతో ఆమెకి వైరం పెరుగుతూ వచ్చింది. నెపోటిజంతో వచ్చి స్టార్ హీరోయిన్స్ అయిన వారిపై కంగనా రనౌత్ నేరుగానే విమర్శలు చేయడంతో బాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది.
కంగనా రనౌత్ ని సపోర్ట్ చేసే వారి ఆమెతో సినిమాలు చేయడానికి ముందుకొచ్చేవారు. బాలీవుడ్ పార్టీలకి కూడా కంగనా దూరమైంది. అయిన కూడా ఆమెకున్న మైలేజ్ తో తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకొని దూసుకుపోతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఫీమేల్ సెంట్రిక్ కథలకి కంగనా రనౌత్ కేరాఫ్ గా మారిపోయింది. అయితే ఆమె చివరిగా మణికర్ణిక సినిమాతో 90 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించి సూపర్ హిట్ కొట్టింది.
ఆ తరువాత జడ్జిమెంటల్ హైకియా, పంగా, తలైవి, దక్కడ్ తో ప్రతి ఏడాది ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇవేవీ కూడా సక్సెస్ కాలేదు. అన్ని డిజాస్టర్స్ తో భారీ నష్టాలు మిగిల్చాయి. చివరిగా వచ్చిన దక్కడ్ మూవీ అయితే 85 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా కేవలం 2.85 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. ఈ సినిమా ఆమె కెరియర్ మీద కూడా చాలా ప్రభావం చూపించింది.
ఏడాది గ్యాప్ తర్వాత మరల ఇప్పుడు చంద్రముఖి 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ చిత్రంలో టైటిల్ రోల్ ని కంగనా రనౌత్ పోషించింది. ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే లేవు. అయితే చంద్రముఖి 2 సక్సెస్ అయితే మళ్ళీ కంగనా రనౌత్ ఇమేజ్, కెరియర్ ట్రాక్ లో పడుతుంది. చంద్రముఖి 2 సక్సెస్ అయితే సౌత్ లో కూడా కంగనాకి మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.