డేట్ తెలీదట.. కంగనకు ఇది అవమానం కాదా?
క్వీన్ కంగన రనౌత్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తదుపరి `చంద్రముఖి 2`లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
క్వీన్ కంగన రనౌత్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తదుపరి `చంద్రముఖి 2`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాఘవ లారెన్స్ ఇందులో మరో కీలక పాత్రధారి. పి.వాసు దర్శకత్వం వహించారు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఇంతలోనే ప్రచారకార్యక్రమాల్లో కంగనకు రకరకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇటీవల ఒక ఉత్తరాదికి చెందిన నెటిజన్ కంగనా రనౌత్‌ని హిందీ డబ్బింగ్ వెర్షన్ విడుదల కాదా? అని అడిగాడు. దీనిపై కంగనా స్పందిస్తూ.. తన సినిమా హిందీ వెర్షన్‌పై తనకు క్లారిటీ లేదని చెప్పింది.
సోషల్ మీడియా యూజర్ `చంద్రముఖి 2` గురించి అప్‌డేట్ ఇవ్వమని, ఈ చిత్రం డబ్బింగ్ వెర్షన్ గురించి సమాచారాన్ని స్పష్టం చేయమని కంగనాను కోరారు. ఈ ప్రశ్నకు కంగన స్పందిస్తూ-``హిందీ వెర్షన్ న లైకా ప్రొడక్షన్స్ పంపిణీ చేయదు. జీ-టెలీఫిలింస్ డబ్బింగ్ వెర్షన్ లను చూస్తోంది. హిందీ వెర్షన్ విడుదల తేదీపై నాకు క్లారిటీ లేదు. నేను జీటెలీఫిలింస్ యజమాని మనీష్ జీతో మాట్లాడాను. అతను హిందీ వెర్షన్‌ను అస్సలు విడుదల చేయడం లేదు. కానీ ఇప్పుడు కొందరు అతడే విడుదల చేస్తారని అంటున్నారు`` అంటూ అస్పష్ఠంగా మాట్లాడింది.
చంద్రముఖి 3 తమిళంలో తెరకెక్కి ఇతర భాషల్లోకి అనువాదమై విడుదలవుతోంది. చంద్రముఖి (2005) - నాగావళి (2010) తర్వాత చంద్రముఖి 3 కి దర్శకుడు పి వాసు దర్శకత్వం వహించారు. ఆయనే ఈ చిత్రానికి రచయిత. 2005లో రజనీకాంత్ - జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చంద్రముఖిలో పాత్రధారుల అద్భుత నటనాభినివేశం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆద్యంతం రక్తి కట్టించాయి.
ఇప్పుడు చంద్రముఖి 3లో కాస్టింగ్ ఇంట్రెస్టింగ్. కంగన నుంచి జ్యోతిక చేసినంత పెర్ఫామెన్స్ ని ఆశించవచ్చు. ఈ చిత్రంలో మహిమా నంబియార్, లక్ష్మి మీనన్, వడివేలు, సృష్టి డాంగే, రాధిక శరత్‌కుమార్ తదితరులు సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. తమిళంతో పాటు హిందీ, తెలుగు భాషల్లో కూడా ఒకేసారి అత్యంత భారీగా విడుదల కానుంది.