2025 ఆస్కార్ లో కంగువ సంచలనం!
అయితే ఏ కేటగిరీలో ఎంపికైంది అన్నది మాత్రం వెల్లడించలేదు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం రావాల్సి ఉంది.
సూర్య కథానయకుడిగా శివ దర్శకత్వంలో తెరెక్కిన పాన్ ఇండియా చిత్రం `కంగువ` 2025 ఆస్కార్ కి ఎంట్రీ లభించింది. పలు హాలీవుడ్ సినిమాల జాబితాలో కంగువ ఉన్నట్లు మనోబాల విజయ్ బాలన్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. దీంతో` కంగువ` నెట్టింట సంచలనంగా మారింది. పిరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా భారీ అంచనాల మధ్య ఈ చిత్రం పాన్ ఇండియాలో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.
కానీ అంచనాలు అందుకోవడంలో సినిమా ఘోరంగా విఫలమైంది. ఏ భాషలోనూ సినిమాకు మంచి రెస్పాన్స్ రాలేదు. చివరికి తమిళనాడులో కూడా అభిమానుల్ని అలరించలేకపోయింది. సూర్య కెరీర్ లోనే తొలి భారీ బడ్జెట్ చిత్రం సహా పాన్ ఇండియా చిత్రం కూడా ఇదే. ఈ సినిమా కేవలం 100కోట్లు వసూళ్లు మాత్రమే సాధించింది. కానీ బడ్జెట్ మాత్రం భారీగా అయింది. 300-350 కోట్ల ఖర్చు చేసినట్లు ప్రచారంలో ఉంది.
అంటే ఈ సినిమా ఎంతగా నష్టాలు తెచ్చి పెట్టిందో చెప్పొచ్చు. నవంబర్ 14న సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. కానీ తొలి షోతోనే నెగిటివ్ టాక్ వచ్చేసింది. అయితే ఇప్పుడీ సినిమా అస్కార్ ఎంట్రీకి లభించడం ఆసక్తికరంగా మారింది. ఆస్కార్ సహా ఇతర అవార్డుల ఎంట్రీకి సక్సెస్ తోనూ..వసూళ్లతోనూ సంబంధం లేదు. వివిధ కేటగిరీల నుంచి సినిమాలు అవార్డులకు నామినేట్ అవుతుంటాయి. ఆ కోవలో కంగువ ఆస్కార్ బరిలో నిలిచింది. అయితే ఏ కేటగిరీలో ఎంపికైంది అన్నది మాత్రం వెల్లడించలేదు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం రావాల్సి ఉంది.
అయితే ఈ సినిమాపై ప్రముఖ సౌండ్ ఇంజినీర్, ఆస్కార్ అవార్డ్ గ్రహీత రసూల్ పూకుట్టి కంగువ రిలీజ్ అనంతరం సౌండింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సౌండ్ మిక్సింగ్ సరిగ్గా జరగలేదని, డైలాగుల్లో క్లారిటీ లేదన్నారు. ఇలాంటి మన జనాదరణ పొందిన చిత్రాలలో సౌండ్ గురించి రివ్యూ ను చూడటం చాలా నిరుత్సాహ పరుస్తుందని వ్యాఖ్యానించారు.