UI మూవీ.. డీప్ గా వెళ్తుంటే రకరకాల లేయర్స్..

అయితే ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్.. మూవీపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. పాజిటివ్ వైబ్స్ సృష్టించింది.

Update: 2024-12-14 14:42 GMT

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఆయన సినిమా అంటే చాలు.. ఓ స్పెషల్ కంటెంట్ ఉంటుందని అంతా ఫిక్స్ అయిపోతారు. ఉపేంద్ర డైరెక్షన్ చేస్తే ఆ లెక్కే వేరని అంచనా వేస్తారు. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా యూఐ.

 

లహరి ఫిల్మ్స్, వీనస్ ఎంటర్టైనర్స్ బ్యానర్లపై మనోహరన్, శ్రీకాంత్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న యూఐకు నవీన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగులో గీతా ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ రిలీజ్ చేస్తున్నారు. డిసెంబ‌ర్ 20న ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాన్ ఇండియా చిత్రంగా అనేక భాష‌ల్లో విడుదల కానుంది యూఐ మూవీ.

అయితే ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్.. మూవీపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. పాజిటివ్ వైబ్స్ సృష్టించింది. దీంతో అంతా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఉపేంద్ర ఈసారి ఎలాంటి చిత్రంతో వస్తున్నారోనని ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో నేడు ఉపేంద్ర తెలుగు మీడియాతో మాట్లాడారు.

సినిమా కోసం పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. యూఐ కోసం ఆర్ట్ డైరెక్టర్‌ శివకుమార్‌ స్పెషల్ వరల్డ్‌ క్రియేట్‌ చేశారని తెలిపారు. డిఫరెంట్‌ సెట్స్‌ డిజైన్‌ చేశామని చెప్పారు. సెట్స్‌ మొదట్లో చూసినప్పుడు కాస్త విచిత్రంగా ఉంటాయని, కానీ తర్వాత డీకోడ్‌ చేసినప్పుడు వాటి వెనుక ఉన్న అసలు మీనింగ్‌ అర్థం అవుతుందని తెలిపారు.

అజనీష్ లోకనాథ్‌ మ్యూజిక్‌ తన సినిమాకు బిగ్‌ ప్లస్‌ పాయింట్‌ గా నిలిచిందని తెలిపారు. వండర్ ఫుల్‌ మ్యూజిక్‌ ఇచ్చారని, హంగేరీ లో రికార్డింగ్‌ చేశామని తెలిపారు. యూఐ మూవీ రన్ టైమ్ 2 గంటల 10 నిమిషాలు ఉంటుందని వెల్లడించారు. సినిమా చాలా ఫాస్ట్‌ గా ఉంటుందని చెప్పారు. సీక్వెల్ తీయాలని తనకు ఉద్దేశం లేదని తెలిపారు.

ఆడియన్స్‌ ఎంటర్టైన్మెంట్‌ కోసం సినిమాలకే వస్తారని, అందులో ఎంటర్టైన్మెంట్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అన్నీ ఉండాలని అన్నారు. యూఐ మూవీ ఒక మంచి చిత్రంగా అనిపిస్తుందని, కొంచెం డీప్ గా చూస్తే మరో లేయర్ కనిపిస్తోందని, ఇంకా డీప్ గా వెళ్తే పొలిటికల్‌ యాంగిల్‌ కనిపించనుందని తెలిపారు. మరింత డీప్ గా వెళ్తే ఫిలాసఫికల్‌ యాంగిల్‌ ఉంటుందని, అన్నీ ట్రై చేశానని తెలిపారు. మరి యూఐ ఎలా మెప్పిస్తుందో చూడాలి.

Tags:    

Similar News