టాలీవుడ్ భామలందర్నీ కరణ్ ఏకం చేస్తున్నాడా?
ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి లీకైంది. ఇలాంటి వారందర్నీ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ ఏకం చేస్తున్నాడట.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి హీరోయిన్లు అంతా గంపెడు ఆశలతో వెళ్తుంటారు. తెలుగు పరిశ్రమ నుంచి హిందీకి వెళ్లడం అన్నది హీరోయిన్లు అంతా ఓ ప్రమోషన్ గా భావిస్తుంటారు. ఇక్కడ అవకాశాలు వదులుకుని, కోట్ల పారితోషికం కాదని, కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే బాలీవుడ్ కి వెళ్తుంటారు. కానీ అసలు కథ అక్కడికి వెళ్లిన తర్వాత మొదలవుతుంది. కొత్తలో బాగానే ఉన్నా? ఆ తర్వాత సరైన విజయాలు పడకపోయినా? అవకాశాలు రాకపోతే అసలైన కష్టాలు మొదలవుతుంటాయి.
అందుకు ఎంతో మంది భామలు ఎగ్జాంపుల్ గా ఉన్నారు. తాప్సీ , సమంత, పూజాహెగ్డే, మృణాల్ ఠాకూర్, రకుల్ ప్రీత్ సింగ్, రష్మికా మందన్నా వీళ్లంతా టాలీవుడ్ కెరీర్ పీక్స్ లో ఉండగా బాలీవుడ్ లో అడుగు పెట్టిన వారే. వీళ్లలో కొంతమంది అవకాశాలు లేక మళ్లీ కంబ్యాక్ అవుతున్న వారున్నారు. అయితే తాప్సీ, సమంత, రకుల్ లాంటి ఫేమస్ బ్యూటీలంతా బాలీవుడ్ లో సీరియస్ గా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారి జాబితాగా చెప్పొచ్చు.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి లీకైంది. ఇలాంటి వారందర్నీ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ ఏకం చేస్తున్నాడట. వాళ్లందర్నీ ఒకే తాటిపై కి తీసుకొచ్చి సొంత బ్యానర్లో ఓ సినిమా చేసే దిశగా అడుగులు వేస్తు న్నాడుట. ఇదే నిజమైతే కరణ్ ఇక్కడ వినూత్నంగా ఆలోచించినట్లు కనిపిస్తుంది. వీళ్లంతా తెలుగు, తమిళ్ లో ఎంతో ఫేమస్ అయిన వారు. ఇప్పుడు వాళ్లందరి ఇమేజ్ ఆధారంగా ఓ స్టోరీ సిద్దం చేయిస్తున్నాడుట.
ఆ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడుట. కొంతమంది హిందీ హీరోల్ని తీసుకుని రెండు భాషల్లో చేయాలన్నది కరణ్ ప్లాన్ గా తెలుస్తుంది. ఇలా చేయడం వల్ల కరణ్ కి రెండు రకాల లాభాలు. వాళ్లందరికీ భారీగా పారితోషికం ఇవ్వాల్సిన పనిలేదు. కరణ్ బ్యానర్లో అవకాశమే ఓ బ్రాండ్ గా వాళ్లు ఒకే చేస్తారు. వాళ్లంతా హిందీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారు కాబట్టి పారితోషికం డిమాండ్ చేసే ఛాన్స్ లేదు.
ఇక సొంత భాషలో ఎలాగూ కరణ్ మాట కాదనే నటులుండరు. అక్కడ తన బ్రాండ్ తోఎలాగూ బిజినెస్ అవుతుంది. తెలుగు, తమిళ్ లో హీరోయిన్ల ఇమేజ్ తోనూ బిజినెస్ అయిపోతుంది. ఇదే స్ట్రాటజీతో కరణ్ ఇప్పుడు ముందుకు కదులుతున్నట్లు కనిపిస్తుంది. బాలీవుడ్ నిర్మాతల్లో ఇన్నోవేటివ్ గా వెళ్లడం కరణ్ స్టైల్. అందులో రిస్క్ ఉన్నా ఈజీగా తీసుకోగలడు. అందుకే సక్సెస్ అయ్యాడు అన్నది అంతే వాస్తవం.