ఎన్టీఆర్ × కరణ్ జోహార్… ఆ డైరెక్టర్ దొరకడం అంత ఈజీ కాదు
బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ బాలీవుడ్ కు సంబంధించిన దేవర మూవీ ప్రమోషన్స్ తో బిజీ అయ్యాడు.
బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ బాలీవుడ్ కు సంబంధించిన దేవర మూవీ ప్రమోషన్స్ తో బిజీ అయ్యాడు. నార్త్ ఇండియాలో దేవర సినిమాని బలంగా జనాల్లోకి పంపించే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే దేవర మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ తో ధర్మ ప్రొడక్షన్స్ లో సినిమా చేస్తానని కరణ్ జోహార్ ప్రకటించాడు. నిజంగా ఇది కార్యరూపం దాలిస్తే మాత్రం కచ్చితంగా సెన్సేషన్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. కరణ్ జోహార్ బాలీవుడ్ లో బడా నిర్మాతగా ఉన్నారు.
ఎన్టీఆర్ తో మూవీ చేస్తే మాత్రం ధర్మ ప్రొడక్షన్స్ కి సౌత్ లో కూడా గ్రాండ్ ఎంట్రీ లభిస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ కంపెనీ అయిన యష్ రాజ్ ఫిలిమ్స్ ఎన్టీఆర్ ని వార్ 2 సినిమాతో హిందీలో లాంచ్ చేస్తోంది. తరువాత కూడా ఎన్టీఆర్ తో యష్ రాజ్ సోలోగా ఒక స్పై థ్రిల్లర్ ప్లాన్ చేస్తుందనే ప్రచారం నడుస్తోంది. ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా కరణ్ జోహార్ మూవీ ప్లాన్ చేస్తున్నాడనే టాక్ ఇప్పుడు తెరపైకి వచ్చింది.
అయితే ఇప్పట్లో సందీప్ రెడ్డి దొరకకపోవచ్చనే మాట వినిపిస్తోంది. దీనికి కారణం అతని చేతిలో వరుసగా మూడు పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా మూవీ ఒకే అయ్యే ఛాన్స్ ఉందంట. సందీప్ రెడ్డి డార్లింగ్ ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీని ఈ ఏడాదిలోనే స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. నెక్స్ట్ రణబీర్ కపూర్ తో యానిమల్ పార్క్ చేయాల్సి ఉంది.
అది కంప్లీట్ అయ్యాక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టి-సిరీస్ లోనే పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు. ఇవన్నీ కూడా భారీ ప్రాజెక్ట్స్ గానే తెరకెక్కనున్నాయి. కనీసం ఒక్కో సినిమాకి రెండేళ్ల సమయం తీసుకున్న ఈ మూడు కంప్లీట్ కావడానికి 6 ఏళ్ళు పడుతుంది. తరువాత మహేష్ బాబుతో మూవీ ఒకే అయితే దానికి మరో 1-2 ఏళ్ళు పట్టొచ్చు. ఏ విధంగా చూసుకున్న సందీప్ రెడ్డి లైన్ అప్ చూస్తుంటే 7 ఏళ్ళ వరకు ఎవరికి దొరకడు.
కరణ్ జోహార్ ప్లాన్ వర్క్ అవుట్ అవ్వాలంటే సందీప్ రెడ్డి కోసం 7 ఏళ్ళు ఎదురుచూడాలి. ఈ లోపు ఎన్టీఆర్ తో మూవీస్ చేయడానికి చాలా మంది స్టార్ డైరెక్టర్స్ లైన్ అప్ లో సిద్ధంగా ఉన్నారు. దేవర తర్వాత ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ మూవీ తారక్ స్టార్ట్ చేస్తాడు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది. దాంతో పాటు తమిళ దర్శకుడు వెట్రిమారన్ కూడా తారక్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. మరి అప్పటి వరకు ఇదే ఊపులో మాట మీద నిలబడి ఉంటారో లేదో చూడాలి.