కార్తీ క్రేజీ సీక్వెల్.. నెవ్వర్ బిఫోర్ బడ్జెట్

ఈ చిత్రం లో కార్తి ఒక క్యారెక్టర్ లో ఇండియన్ రా ఏజెంట్ గా కనిపించగా మరో పాత్రలో పోలీస్ గా అదరగొట్టాడు.

Update: 2024-01-28 00:30 GMT

కోలీవుడ్ అగ్ర హీరో కార్తి లీడ్ రోల్ లో నటించిన 'సర్దార్‌' సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. కార్తి డ్యూయల్ రోల్‌లో నటించిన ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి విజయం సాధించింది. కార్తి కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం లో కార్తి ఒక క్యారెక్టర్ లో ఇండియన్ రా ఏజెంట్ గా కనిపించగా మరో పాత్రలో పోలీస్ గా అదరగొట్టాడు. ఇక్ ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌ను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

సర్దార్ సినిమాతో వంద కోట్లు కొల్లగొట్టిన కార్తి.. మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ ప్రాజెక్టు ఫిబ్రవరి 2న చెన్నైలో గ్రాండ్ గా పూజ వేడుకలు జరుపుకోబోతోంది. ఈ క్రమంలోనే సీక్వెల్ కి సంబంధించి ఆసక్తికర వార్త బయటకొచ్చింది. అదేంటంటే, ఈ సీక్వెల్ ని మరింత భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

కార్తీ కెరియర్ లోనే ఇప్పటివరకు మరే సినిమాకి పెట్టనంత బడ్జెట్ ని సర్దార్ సీక్వెల్ కోసం కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 120 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నట్లు టాక్. కార్తీ తో పాటు ఈ సీక్వెల్లో సౌత్ కి చెందిన పలువురు స్టార్ సెలబ్రిటీస్ కీలక పాత్రలు పోషించనున్నట్లు సమాచారం. ఈ సీక్వెల్ ని ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. సర్దార్ సినిమాని మించే థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి దర్శకుడు పీ.ఎస్ మిత్రన్ ఈ సీక్వెల్ ని తెరకెక్కించబోతున్నారట.

యువన్ శంకర్ రాజా ఈ సీక్వెల్ కి సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి 2న చెన్నైలో గ్రాండ్ గా జరగనున్న సర్దార్ సీక్వెల్ పూజా కార్యక్రమంలో మూవీ టీమ్ తో పాటూ ఇతర సినీ ప్రముఖులు సైతం హాజరుకానున్నట్లు సమాచారం. ఈ సీక్వెల్ కోసం కార్తీ ఫాన్స్ తో పాటు సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక గత ఏడాది కార్తీ 'జపాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దీపావళి కానుకగా తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోయిందిమ్ కానీ సినిమాలో కార్తీ నటన ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. రాజు మురుగన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కార్తీ దొంగగా డిఫరెంట్ మేకోవర్ తో ఆకట్టుకున్నాడు.


Tags:    

Similar News