రెట్రో డైరెక్టర్ లెగసీ కథ ఏంటి..?
కోలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరు కార్తీక్ సుబ్బరాజు. తన ప్రతి సినిమాతో ఆడియన్స్ కు ప్రత్యేకమైన భావన కలిగేలా చేసిన ఈ డైరెక్టర్ ప్రస్తుతం సూర్యతో రెట్రో సినిమా చేస్తున్నాడు.
కోలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరు కార్తీక్ సుబ్బరాజు. తన ప్రతి సినిమాతో ఆడియన్స్ కు ప్రత్యేకమైన భావన కలిగేలా చేసిన ఈ డైరెక్టర్ ప్రస్తుతం సూర్యతో రెట్రో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి ఆడియన్స్ కు వింటేజ్ సూర్యని పరిచయం చేయాలని చూస్తున్నాడు. సూర్య సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లవ్ స్టోరీ తో పాటు యాక్షన్ సినిమాగా రాబోతుంది.
డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజుకి స్పెషల్ స్టైల్ ఉంది. ఐతే డైరెక్టర్ గానే కాదు ప్రొడ్యూసర్ గా కార్తీక్ సినిమాలు, వెబ్ సీరీస్ లు నిర్మిస్తున్నారు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ స్నేక్ అండ్ లాడర్ వెబ్ సీరీస్ నిర్మాణానికి సపోర్ట్ అందించారు కార్తీక్ సుబ్బరాజు. ఇక లేటెస్ట్ గా మరో వెబ్ సీరీస్ ని నిర్మిస్తున్నారు కార్తీక్ సుబ్బరాజు. మాధవన్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ వెబ్ సీరీస్ లో దుల్కర్ సల్మాన్, గౌతం కార్తీక్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది.
కార్తీక్ సుబ్బరాజ్ నిర్మిస్తున్న ఈ వెబ్ సీరీస్ ని చారుకేష్ శేఖర్ డైరెక్ట్ చేస్తున్నారు. స్టోన్ బెంచ్ మూవీస్ బ్యానర్ లో కార్తీక్ సుబ్బరాజు ఈ సీరీస్ ని నిర్మిస్తున్నారు. ఐతే సెట్స్ మీద ఉన్న ఈ సీరీస్ ను నెట్ ఫ్లిక్స్ తమిళ్ మంచి ధరకు కొనేసినట్టు తెలుస్తుంది. కార్తీ ఐడియాలజీ గురించి తెలిసిన నెట్ ఫ్లిక్స్ తమిళ్ ఈ వెబ్ సీరీస్ ను భారీ మొత్తానికే పొందినట్టు తెలుస్తుంది.
కార్తీక్ సుబ్బరాజ్ ఈమధ్యనే రామ్ చరణ్ నటించిన గేం ఛేంజర్ కు కథ అందించారు. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ అంచనాలను అందుకోలేదు. కార్తీక్ సుబ్బరాజు డైరెక్టర్ గానే కాదు నిర్మాతగా కూడా ప్రతిభ గల వారికి అవకాశాలు ఇస్తున్నాడు. సినిమాలు, వెబ్ సీరీస్ లు నిర్మాతగా తన ఫాం కొనసాగించాలని చూస్తున్నాడు. కార్తీక్ సుబ్బరాజు సూర్య కాంబోలో వస్తున్న రెట్రో సినిమా సంథింగ్ స్పెషల్ గా సూర్య ఫ్యాన్స్ కి పక్కా మాస్ ట్రీట్ అందించేలా ఉంటుందని తెలుస్తుంది. మే 1న ఈ సినిమా రిలీజ్ లాక్ చేశారు. కంగువ నిరాశపరచడంతో రెట్రోతో ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు సూర్య. కార్తీక్ సుబ్బరాజు కూడా సూర్య సినిమా విషయంలో మరింత ఫోకస్ గా పనిచేస్తున్నాడని తెలుస్తుంది.